కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిన్న చేవేళ్లలో నిర్వహించిన బీజేసీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ సా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ దుమారం రేపుతున్నాయి. ముస్లింల రిజర్వేషన్లను ఎత్తివేస్తామని ప్రకటించిన అమిత్ షా వ్యాఖ్యలపై సుప్రీంలో కేసు వేస్తానని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న హోంమంత్రి ఒక వర్గానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. రిజర్వేషన్లు తీయడం అమిత్ షా తరం కాదని అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా హోంమంత్రి పదవికి అన్‌ఫిట్ అని పేర్కొన్నారు. దేశంలో అంబేద్కర్ రాజ్యంగం నడుస్తుందా..? బీజేపీ రాజ్యంగం నడుస్తుందా..? అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.
Also Read : Round The World Cruise: ప్రయాణికుడ్ని వదిలి క్రూజ్ షిప్ జంప్.. 17 లక్షలు స్వాహా
ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామనడం బీజేపీ ఆహంకానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. మత పరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పడంతో పాటు పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా సూచించిందని గుర్తుచేశారు. మా ప్రభుత్వం వెనకబడిన ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు షబ్బీర్ అలీ. పేద ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లు తొలగిస్తామంటే ఎలా..? ఆగ్రహం వ్యక్తం చేశారు. మత పరంగా ముస్లింలను శత్రువులుగా చూస్తే ఎలా అని అడిగారని, హోంమంత్రి రాజ్యాంగ విరుద్ధంగా ఎలా మాట్లాడుతారని విమర్శించారు షబ్బీర్ అలీ. ముస్లిం రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదని, అమిత్ షా పై రాజ్యాంగ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : Adimulapu Suresh: అందుకే నేను చొక్కా విప్పా.. సిగ్గు పడటం లేదు..