NTV Telugu Site icon

Shabbir Ali : ఫార్ములా ఈ రేసులో కేటీఆర్‌ రోజుకో మాట మాట్లాడుతున్నారు

Shabbir Ali

Shabbir Ali

Shabbir Ali : ఫార్ములా ఈ రేస్ కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అరవింద్‌కి డబ్బులు బదిలీ చేయమని తానే చెప్పానని, కోర్టులో మాత్రం తనకేం సంబంధం లేదని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కేటీఆర్‌కి నీతి లేదు అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రమే కేటీఆర్‌ లొల్లి చేస్తున్నారని, ఇదే పరిస్థితి జన్వాడ ఫాంహౌస్‌ ఎపిసోడ్‌లోనూ ఎదురయ్యిందని వ్యాఖ్యానించారు.

Prashanth Kishore : నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిషోర్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, బీఆర్‌ఎస్‌ పార్టీ తాను మాట్లాడే వితండవాక్యాలతో బురద జల్లే పనిలో పడ్డిందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి కొంత సమయం ఇచ్చే వారమని, కానీ కేటీఆర్‌ , హరీష్‌లు ఇష్టపడినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే, కేసీఆర్ కనిపించడం లేదు, ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఏమిటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో వారు ఏం చేసారో గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా, ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఈడీ విచారణకు 2025 జనవరి 2న గైర్హాజరయ్యారు. అతను కొన్ని రోజుల గడువు ఇవ్వాలని ఈడీకి విజ్ఞప్తి చేశాడు.

Free Bus Scheme: కర్ణాటక బస్సులో ఏపీ మంత్రుల ప్రయాణం.. సీఎంను కలవనున్న కేబినెట్ సబ్ కమిటీ!