NTV Telugu Site icon

Shabbir Ali : కేటీఆర్, హరీష్‌లు రెచ్చగొడుతున్నా రైతులు ఎక్కడ కూడా ధర్నాకు దిగలేదు

Shabbir Ali

Shabbir Ali

Shabbir Ali : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజక వర్గ అబివృద్ధికి 27 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 54000 వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. గ్రూప్ పరీక్షలు పేపర్ లీక్ లేకుండా యధావిధిగా నడిపించినామన్నారు షబ్బీఆర్‌ అలీ. కేటీఆర్, హరీష్ లు రెచ్చ గొడుతున్నా ధాన్యంకు మద్దతు ధర ఉందని రైతులు ఎక్కడ కూడా ధర్నా కు దిగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటికి 15 లక్షల అన్నావు ఎక్కడా.. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చినవు మోదీ అని ఆయన అన్నారు. అదానీ మీద ఎన్ని కంప్లెట్స్ వచ్చిన ఎందుకు అతన్ని వెనకేసుకు వస్తున్నావు మోదీని ఆయన అన్నారు.

Minister Satya Kumar Yadav: ప్రమాదంలో 108 అంబులెన్స్ పైలట్ దుర్మరణం.. ఆరా తీసిన మంత్రి

2014 లో 14 వేల కోట్ల నగదు, 67 వేల కోట్ల అప్పు ఉండే, లక్ష కోట్ల అప్పు చేశాడు కేసీఆర్ అని, కవిత నీకు మీ నాన్న కు దోచుకునుడే తెలుసు అని, తెలంగాణ రాగానే నీకు మీ అన్నకు , మీ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని, మహిళలు మద్యం వద్దంటారు,కవిత నువ్వు లిక్కరు బిజినెస్ చుసు కున్నావు, జైలు పాలయ్యవన్నారు షబ్బీర్‌ అలీ. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని, తెలంగాణ తల్లి విగ్రహానికి రేవంత్ రెడ్డి గౌరవం ఇస్తూ విగ్రహాన్ని పెట్టిస్తున్నాడన్నారు షబ్బీర్‌ అలీ.

Discount On iPhone: త్వరపడండి.. ఐఫోన్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్

Show comments