Rashmika Mandanna: బ్రేకింగ్.. డీప్ ఫేక్ వీడియో.. స్పందించిన రష్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna: టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతుందని ఆనందపడాలో.. ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని బాధపడాలో తెలియని సందిగ్ద స్థితిలో ఉంది సమాజం. ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం AI టెక్నాలజీ ఒక ఊపు ఊపేసిన విషయం తెల్సిందే. ఎలాంటి మనిషిని అయినా AI టెక్నాలజీ మార్చేస్తుంది. ఒకప్పుడు మార్ఫింగ్ వీడియోలు అంటూ.. ఎవరో గుర్తుతెలియని మనుషుల ముఖాల ప్లేస్ లో సెలబ్రిటీల ముఖాలను అతికించి సోషల్ మీడియాలో వదిలేవారు. ఇక ఇప్పుడు అదే AI టెక్నాలజీ తో చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారు. ఇక నేటి ఉదయం నుంచి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెల్సిందే. బ్లాక్ కలర్ టైట్ ఫిట్ జిమ్ డ్రెస్ లో వల్గర్ గా ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోలకు పోజులివ్వడానికి రష్మిక నిలబడిన వీడియో సెన్సేషన్ సృష్టించింది. దీంతో రష్మిక ఏంటి.. ఇలాంటి వీడియో ఏంటి అంటూ ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ఇది ఒరిజినల్ వీడియో కాదని, ఆ వీడియోలో ఉన్నది రష్మిక కాదని.. వేరే అమ్మాయి ముఖాన్నీ AI టెక్నాలజీతో రష్మిక ఫేస్ పెట్టి రిలీజ్ చేశారు. ఇక దీంతో ప్రతి ఒక్కరు రష్మికకు సపోర్ట్ గా నిలిచారు. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ సైతం.. దీనిపై లీగల్ చర్యలు తీసుకోవాలని తెలిపాడు. ఇక తాజాగా ఈ ఫేక్ వీడియోపై రష్మిక ట్విట్టర్ ద్వారాస్పందించింది.
Dhanraj : ధనరాజ్ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ అప్డేట్ వచ్చేసింది.
Also Read
” ఈ ఘటన గురించి మాట్లాడడం చేయడం నాకు చాలా బాధగా ఉంది. ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందుతున్న నా డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడవలసి వచ్చింది. ఇలాంటివి నిజం చెప్పాలంటే.. నాకే కాదు, చాలామందిని భయానికి గురిచేస్తోంది.
టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే భయంతో పాటు.. వాటి వలన నష్టాలు ఎలా ఉంటాయో అని చాలామంది భయపడుతున్నారు. ఈ రోజు ఒక మహిళగా మరియు నటిగా నాకు రక్షణ మరియు మద్దతు వ్యవస్థగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ ఇలాంటి ఘటనే నేను స్కూల్‌లో లేదా కాలేజీలో ఉన్నప్పుడు జరిగితే.. నేను దీన్ని ఎలా ఎదుర్కోగలనో నిజంగా ఊహించలేను. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా మనమందరం ఒక కమ్యూనిటీగా మారి త్వరగా వీటికి పరిష్కారం చూపాలి” అని తెలుపుతూ సైబర్ క్రైమ్ ను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
I feel really hurt to share this and have to talk about the deepfake video of me being spread online.
Something like this is honestly, extremely scary not only for me, but also for each one of us who today is vulnerable to so much harm because of how technology is being misused.…
— Rashmika Mandanna (@iamRashmika) November 6, 2023
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!