రాష్ట్రంలో బీజేపీ నోటీసులు.. టీఆర్‌ఎస్‌ల సమన్ల డ్రామా నడుస్తుందని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరి డ్రామాల మధ్య ప్రజల సమస్య పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.. రోజు అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. వీటి మీద అసలు సమీక్షలే లేవని, బీజేపీ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. పెట్రో ధరలు పెరిగితే పట్టించుకునే నాధుడే లేడని, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొంటున్నారు అని కేసీఆర్ సిట్ వేశారు.. బీజేపీ వేసిన ఎరలో ముగ్గురూ ఎమ్మె్ల్యేలు మా పార్టీ నుండి కొన్నవారే అని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. 47 ఎమ్మె్ల్యేలు ఎమ్మెల్సీలను కేసీఆర్ కొన్నాడని, సిట్ విచారణ ..కేసీఆర్ కొన్న ఎమ్మెల్యేల అంశం కూడా చేర్చాలన్నారు షబ్బీర్ అలీ. లిక్కర్ కేసులో కవిత పేరు వస్తే విచారణ కు పోవాలని, విచారణలో దోషి ఐతే జైలు కు పోతుందని, లేకుంటే ఇంటికి వస్తోందన్నారు.
Also Read : YS Jagan Mohan Reddy: ముర్ము జీవితం.. ప్రతీ మహిళకు ఆదర్శనీయం
దానికి ప్రజలకు వచ్చే ఇబ్బంది ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్.. బీజేపీ భార్యాభర్తల మాదిరిగా ఇంట్లో బాగానే ఉంటున్నారు… వీధిలోకి వచ్చి గొడవ చేస్తున్నారని షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. ధరణిలో నాదే రెండున్నర ఎకరాలు గాయబ్ అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. సెట్ చేస్తాం అని అధికారులు అంటున్నారని, పేదోల పరిస్థితి ఏంటని ఆయన మండిపడ్డారు. ఇట్లనే చేస్తే.. నక్సలైట్లలను ఆశ్రయించే పరిస్థితి వస్తోందన్నారు. ఈడీ నోటీసులు ఇస్తే రాహుల్.. సోనియా గాంధీ విచారణకు వెళ్లారన్నారు. . బీజేపీ నోటీసులు వస్తే భయం ఎందుకు అన్నారని, మరి బీఎల్ సంతోష్ సిట్ విచారణకు వస్తే తప్పు ఏంటని ఆయన అన్నారు. విచారణకు వచ్చి నిజాయితీ నిరూపించుకోవాలని, కవిత ఇంటికి వస్తాం అని అనడం ఏంటని, అందరిని ఆఫీసుకు పిలిచి..కవిత ని ఎందుకు పిలవరు.. ఇదేం డ్రామా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
