NTV Telugu Site icon

Russia: ఆఫీసు సమయంలో సె** బ్రేక్!.. పుతిన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?

Puthin

Puthin

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై యావత్ ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఈ యుద్ధం చాలా ఆందోళనలను కలిగించింది. అయితే తాజాగా రష్యాలో తీసుకున్న మరో నిర్ణయం సంచలనంగా మారింది. ప్రస్తుతం రష్యా జనాభా క్షీణతపై ఆందోళన చెందుతోంది. రష్యాలో జనాభా తగ్గుతోందట. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. దీని కారణంగా రష్యన్ యువకులు దేశం నుంచి వలసపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. రష్యా ఆరోగ్య మంత్రి డాక్టర్ యెవ్జెనీ షెస్టోపలోవ్ ఆఫీసుకు వెళ్లేవారు లంచ్, కాఫీ సమయాన్ని సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఉపయోగించాలని సూచించారు. రష్యా యొక్క సంతానోత్పత్తి రేటు ప్రతి స్త్రీకి 1.5 పిల్లలకు చేరిన తర్వాత ప్రకటన వెలువడింది.

READ MORE: Bhopal: మూడేళ్ల బాలికపై టీచర్ అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్లో గాయం చూసి తల్లి షాక్

జనాభా తగ్గుదల ఆందోళనపై ఆరోగ్య మంత్రి డాక్టర్ షెస్టోపలోవ్ మాట్లాడుతూ.. ప్రజలపై ఉన్న పని భారమే వారు కుటుంబాలను మొదలుపెట్టేందుకు ఇష్టపడకపోవడానికి కారణన్న వాదనలను కొట్టివేశారు. “జీవితం చాలా వేగంగా ఎగురిపోతుంది.” అని షెస్టోపాలోవ్ వ్యాఖ్యానించారు. 12 నుంచి 14 గంటలు పనిచేసేవారు కూడా సంతానోత్పత్తి కోసం వారి విరామాలను ఉపయోగించాలని అన్నారు. రష్యా ప్రజల రక్షణ తమ అత్యున్నత జాతీయ ప్రాధాన్యమని పుతిన్ గతంలోనే స్పష్టం చేశారు. “రష్యా భవితవ్యం. మనలో ఎంతమంది ఉంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమస్య,” అని అన్నారు. అయితే తగ్గుతున్న జనాభాను అధిగమించేందుకు .. ఉద్భవించిన ఈ పరిష్కారం ఇతర సమస్యలకు దారితీస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

READ MORE:Jani Master: జానీ మాస్టర్ లవ్ జీహాద్.. బీజేపీ నేత సంచలనం!!

పని సంస్కృతి ఏమవుతుంది…?
పని ప్రదేశంలో శారీరక వేధింపుల సంఘటనలను నివారించడానికి లైంగిక వేధింపుల నివారణ (PoSH) వంటి విధానాలు తీసుకురాబడ్డాయి. కానీ రష్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కార్యాలయాల్లో బలవంతంగా మానభంగం కేసులు పెరగొచ్చని నిపుణుల చెబుతున్నారు. ముంబైకి చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్, రిలేషన్ షిప్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ సాగర్ ముంద్రా మాట్లాడుతూ.. “ఒకవైపు తమపై జరుగుతున్న అకృత్యాలను సహించలేని మహిళలు రోడ్కెక్కుతున్నారు. మరోవైపు ప్రభుత్వమే కార్యాలయంలో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని ప్రచారం చేస్తే పరిస్థితి చేయి జారిపోతుంది. పరిస్థితిని అధిగమించడం పెద్ద టాస్క్ గా మారుతుంది” అని పేర్కొన్నారు.