Jani Master: జానీ మాస్టర్ లవ్ జీహాద్.. బీజేపీ నేత సంచలనం!!
- సంచలనంగా మారుతున్న జానీ మాస్టర్ కేసు
- కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు
- లవ్ జీహాద్ అంటూ సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ మహిళా నేత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యువ అసిస్టెంట్ కొరియోగరాఫర్ పై డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం అంటూ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి పేర్కొన్నారు. ఓ యువతిని ఐదేళ్ల పాటు నరకం చూపించడంతో పాటు, వేధింపులు, దాడులకు పాల్పడటం, మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురిచేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆమె అన్నారు. ఇది లవ్ జిహాద్ కేసు, ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేసినట్లు స్పష్టంగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినప్పటికీ కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడం ఏంటి..? అని ఆమె ప్రశ్నించారు. ఇంత వరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం దుర్మార్గం అని పేర్కొన్న శిల్పా రెడ్డి ఈ ఘటనకు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను తేలికగా తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం అని పేర్కొన్న ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై వేధింపులకు, లవ్ జిహాదీ చర్యలకు పాల్పడిన షేక్ జానీపై గతంలోనూ నేరచరిత్ర ఉందని, 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు ఆరునెలల పాటు జైలుశిక్ష విధించినట్లు స్వయంగా పోలీసులే వెల్లడించారని గుర్తు చేశారు.
Stock market: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Also Read
తాజాగా మరోసారి మహిళా డ్యాన్సర్ పై, మైనర్ గా ఉన్నప్పటి నుంచీ వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ కేసును తేలికగా తీసుకోవడాన్ని బిజెపి మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాగం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఈ కేసును విచారణను జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి, చట్టపరంగా పారదర్శకంగా విచారణను జరిపించేలా చర్యలు తీసుకోవాలి, లేనిపక్షంలో బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శిల్పా రెడ్డి హెచ్చరించారు. తెలుగు చిత్ర పరిశ్రమ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై బిజెపి చేసిన లవ్ జిహాద్ ఆరోపణలు, ఈ వ్యవహారాన్ని మరింత వివాదాస్పదంగా మారుస్తాయని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!