NTV Telugu Site icon

Heat Waves: ఈ ఏడు సుర్రు సమ్మరే.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు!

Summer

Summer

Heat Waves: ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతోంది. బయటికి వెళ్లాలంటే భయం పుట్టిస్తున్నాడు భానుడు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్‌లో ఎలా ఉంటుందోనని భయం వేస్తోంది. ప్రస్తుతం అన్ని కాలాలు ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి. పోయిన ఏడాది చలికాలంలోనూ ఎండలు దంచికొట్టాయి. కానీ ఇప్పుడు మాత్రం వేసవి ముందుగానే వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఎండకాలం ముందుగానే పలకరించిందని వాతావరణ శాఖ చెప్తోంది. సాధారణంగా మార్చి మూడో వారం నుంచి సూర్యప్రతాపం మొదలవుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రారంభమైన ఎండలు మే నెలాఖరు వరకు తీవ్రంగానే ఉండే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.

Read Also: Jayaho BC Meeting: నేడు మంగళగిరిలో టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ

2016 మార్చి 2వ వారంలో రికార్డు స్థాయిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మూడోవారం నాటికి దాదాపు 44 డిగ్రీల వరకు చేరింది. ఈ ఏడాది కూడా అవే రికార్డులను భానుడు తిరగరాస్తాడని వాతావరణ శాఖ లెక్కలు కడుతోంది. తీవ్రమైన ఎండలకు ఎల్‌నినో కారణమని చెప్తోంది భారత వాతావరణ శాఖ. పసిఫిక్‌లో నవంబర్‌-జనవరి మధ్య ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీని కారణంగానే ఎల్‌నినో ఏర్పడింది. ఫలితంగా ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని గత 6 నెలల ముందే అంచనా వేశారు. అలాగే లానినో ప్రభావంతో జూన్‌ మొదటి వారం తర్వాత వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మొత్తానికి ఈ ఏడాది ఎండలు మండిపోయినా.. ఎల్‌నినో తర్వాత లానినో వచ్చి వర్షాలు పడతాయని అంచనాలు కడుతోంది వాతావరణ శాఖ.

 

Show comments