Site icon NTV Telugu

Crackers Factory Blast: బెంగాల్‌లో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఏడుగురు మృతి

Blast

Blast

పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నార్త్ 24 పరగణాల జిల్లాలోని దత్తపుకూర్‌ పోలీసుస్టేషన్ పరిధిలోని అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో భారీగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. అక్రమ బాణసంచా తయారీ కేంద్రానికి ఆనుకుని ఉన్న పలు ఇళ్లు కూడా పెద్ద మొత్తంలో దెబ్బ తిన్నాయి. ప్రస్తుతం సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also: Tip for Women: మహిళలకు అదిరిపోయే చిట్కా.. ఆ సమయంలో ఈ జ్యూస్ తాగితే..!

కోల్‌కతాకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలోని దత్తపుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీల్‌గంజ్‌లోని మోష్‌పోల్‌లోని ఫ్యాక్టరీలో పలువురు పని స్తున్నప్పుడు ఇవాళ ( ఆదివారం ) ఉదయం 10 గంటలకు ఈ పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read Also: Salaar: ఫైర్ మోడ్ లో ఓవర్సీస్… రిలీజ్ కి నెల రోజుల ముందే వన్ మిలియన్ మార్క్

Exit mobile version