పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నార్త్ 24 పరగణాల జిల్లాలోని దత్తపుకూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో భారీగా పేలుడు సంభవించింది.