NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు..

Andhra Pradesh

Andhra Pradesh

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, సాల్మన్ ఆరోక్య రాజ్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ కుమార్ ను రీడిజిగ్నెట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం డిప్యూటేషన్ పై సాల్మన్ ఆరోక్య రాజ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు.

Read Also: Covid 19: మొదటి కరోనా కేసుకి 5 ఏళ్లు.. చైనా ఏం చెబుతోందంటే..?

అలాగే.. 2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులకు కూడా పదోన్నతులు పొందారు. కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్, సీహెచ్ శ్రీధర్‌లకు కార్యదర్శి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎంఓలో సహాయ కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు.. అక్కడే సీఎం కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. మరోవైపు.. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓగా వీరపాండ్యన్ కొనసాగనున్నారు. కడప జిల్లా కలెక్టర్‌గానే శ్రీధర్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు.. ఇద్దరు ఐపీఎస్ అధికారులు విక్రాంత్ పాటిల్, సిద్ధార్థ్ కౌశల్‌లకు పదోన్నతులు కల్పించారు.

Read Also: Bike Lift: బైక్ లిఫ్ట్ ఇస్తున్నారా..? డబ్బులు కాజేస్తున్న కిలాడీ లేడీలు

విజయవాడ దుర్గ గుడి ఇంఛార్జి ఈవోగా భ్రమరాంబ..
విజయవాడ దుర్గ గుడి ఇంఛార్జి ఈవోగా దేవాదాయ శాఖ భ్రమరాంబను నియమించింది. ప్రస్తుత ఈవో కేఎస్ రామరావు పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో.. భ్రమరాంబను ఇంఛార్జి ఈవోగా నియమించారు. గతంలో దుర్గ గుడి ఈవోగా భ్రమరాంబ సుదీర్గ కాలం పని చేసింది.

Show comments