ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, సాల్మన్ ఆరోక్య రాజ్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ కుమార్ ను రీడిజిగ్నెట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
రవాణాశాఖలో డీటీసీలను జేటీసీలుగా, ఆర్టీవోలను డీటీసీలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా డీటీసిలు, జేటీసీలుగా పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ దళం అయిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన మొత్తం 2,600 మంది కుక్‌లు, వాటర్ క్యారియర్‌లకు పదోన్నతి లభించింది. 1939లో ఏర్పాటైన 85 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. సీఆర్పీఎఫ్ క్యాటరింగ్లో రెండు ప్రత్యేక కేటగిరీలకు చెందిన మొత్తం 12,250 మంది సిబ్బందిని కలిగి ఉన్నారు. వీరు దళంలోని సుమారు 3.25 లక్షల మంది పురుషులు, మహిళా సిబ్బంది కోసం.. వంటశాలలు, క్యాంటీన్‌లు, ఇతర పరిపాలనా విధులను…
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, 2006 బ్యాచ్‌కు చెందిన డీఐజీలకు ఐజీలుగా ప్రమోషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. కొల్లి రఘురామరెడ్డి, సర్వోశ్రేష్ట త్రిపాఠి, అశోక్ కుమార్, విజయ్ కుమార్, హరికృష్ణ, ఎం. రవి ప్రకాష్, రాజశేఖర్, కేవీ మోహన్‌రావు, రామకృష్ణకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.