Site icon NTV Telugu

S*exually Assault: ​తిరుచానూరులో ఏడేళ్ల గిరిజన చిన్నారిపై లైంగిక దాడి

Tirchanur

Tirchanur

S*exually Assault: ​తిరుపతి జిల్లా తిరుచానూరులో చిన్నారిపై లైంగిక దాడి తీవ్ర కలకలం రేపింది. ఏడేళ్ల గిరిజన బాలికపై ఓ వ్యక్తి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని గురి చేసింది. అయితే, నగరి మండలానికి చెందిన నాగరాజు (30)గా పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకల తర్వాత రోజు బాలిక బయట ఆడుకుంటుండగా, నిందితుడు ఆమెను మాటల్లో పెట్టి చాక్లెట్ ఇస్తానని నమ్మించి పక్కకు తీసుకెళ్లి.. లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: Ashish Vidyarthi: ప్రమాద వార్తలపై స్పందించిన ఆశిష్ విద్యార్థి.. భార్య ఆరోగ్యం పై క్లారిటీ

అయితే, ఈ ఘటనను గమనించిన స్థానికులు, బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం తిరుచానూరు పోలీసులకు అప్పగించారు. బాలికను వైద్య పరీక్షల కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. దీంతో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసుతో పాటు భారతీయ శిక్షాస్మృతి కింద సంబంధిత సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. చిన్నారిపై లైంగిక దాడి అత్యంత హేయమైన చర్య.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల భద్రతపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Exit mobile version