Site icon NTV Telugu

Viral News: బైక్‌పై ఏడుగురు ప్రయాణం.. పోలీసులు భారీగా చలాన్

Viral News

Viral News

సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం రకరకాల వీడియోలు చేస్తూ.. పోస్ట్ చేస్తున్నారు. కొన్ని వీడియోలలో రకరకాల స్టంట్స్ చేస్తూ.. హైలెట్గా నిలుస్తున్నారు. అయితే.. యూపీలోని హాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన పనికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే….

Read Also: Women Misbehavior : విమాన భద్రతా సిబ్బందిని కొరికిన మహిళ.. చివరకి..

వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి తన బుల్లెట్ బైక్‌పై ఏడుగురు పిల్లలను కూర్చోబెట్టుకుని బండిని నడుపుతున్నాడు. యువకుల ప్రాణాలను లెక్కచేయకుండా.. ప్రయాణం కొనసాగించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా.. ఈ వీడియో చూసిన ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతనికి రూ. 9500 చలాన్ విధించారు. అయితే… ఈ వీడియోను కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది.

Read Also: AP: ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..పోలింగ్ ఎప్పుడంటే?

మరోవైపు.. ఈ వీడియోపై స్పందించిన హాపూర్ జిల్లా పోలీసులు బాధితుడికి వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని ప్రజలకు సూచించారు. కాగా.. సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసమని జనాలు.. దేనిని వదలడం లేదు. చివరకు ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా అదే చేస్తున్నారు.

Exit mobile version