NTV Telugu Site icon

Tragedy: నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృతి..

Bihar

Bihar

బీహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. సోన్ నదిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు మునిగిపోయారు. వారిలో ఐదుగురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. ప్రమాద ఘటనపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన ఇద్దరు పిల్లల ఆచూకీ లభించకపోవడంతో SDRF బృందం రంగంలోకి దిగింది.

Read Also: Heart attack-Exercise: అలర్ట్.. అధిక వ్యాయామంతో గుండెపోటు..!

రోహ్తాస్‌ గ్రామం కేదార్ గౌర్‌కు చెందిన కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు సోన్ నదిలో స్నానానికి వెళ్లారు. వీరంతా.. ఎనిమిది నుండి పన్నెండేళ్ల మధ్య వయస్సు గలవారు. అయితే స్నానానికి నదిలోకి దిగిన వారు లోతు ఎక్కువగా ఉండటంతో ఓ చిన్నారి నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడే క్రమంలో మిగతా వారందరూ నీట మునిగి చనిపోయారు. వారు మునిగిపోతున్న సమయంలో రక్షించమని కోరారు. అయితే.. స్థానికులు అక్కడికి చేరుకునే లోపే నది ప్రవాహానికి కొట్టుకుపోయారు. అక్కడున్న బోటు డైవర్ల బృందం వారిని గుర్తించి ఐదుగురు పిల్లలను బయటకు తీశారు. కానీ, అప్పటికి చాలా ఆలస్యం అయింది. ఐదుగురు చనిపోయారు.

Read Also: Tata Share: సంచలనం సృష్టించిన టాటా షేర్.. లక్ష పెట్టుబడి పెడితే.. రూ. 7.5 కోట్లు అయ్యింది!

ఈ ప్రమాద ఘటనపై డెహ్రీ ఎస్‌డిఎం సూర్య ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. నీటి మట్టం ఎక్కువగా ఉండడంతో చిన్నారులు నీట మునిగి చనిపోయారని తెలిపారు. వారిలో ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారని.. ఇద్దరి కోసం అన్వేషణ కొనసాగుతోందన్నారు. మునిగిపోయిన ఏడుగురిలో ఇద్దరు బాలికలు ఉన్నారని పేర్కొన్నారు.