NTV Telugu Site icon

Madhu Yashki Goud: దేశంలో ఆర్ఎస్ఎస్‌ను సేవాదళ్ ధీటుగా ఎదుర్కొంది..

Vh

Vh

హైదరాబాద్ గాంధీ భవన్‌లో సేవాదళ్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. సేవాదల్ అధ్యక్షులు జితేందర్ అధ్యక్షతన ఈ ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత సేవాదళ్ అధ్యక్షులు లాల్జ్ జి దేశాయ్, ఎంపీ అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు కేశవ రావు, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు.

Read Also: Maharashtra Polls: మహారాష్ట్రలో ముగిసిన పోలింగ్.. మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్!

ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. ఒక సేవాదళ్ కార్యకర్తగా తాను గర్వపడుతున్నానని అన్నారు. సేవాదళ్ 100 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉంది.. దేశంలో ఆర్ఎస్ఎస్ ను సేవాదళ్ ధీటుగా ఎదుర్కొందని తెలిపారు. సేవాదళ్ ఉన్నది ప్రజలకు సేవ చేసేందుకు.. ప్రతి సేవాదళ్ కార్యకర్త కష్టపడి కాంగ్రెస్ అభివృద్ధి కోసం పనిచేయాలని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సేవాదళ్ కీలక పాత్ర పోషించింది.. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు కొంచెం సేవాదళ్ కార్యక్రామాలు తగ్గాయి.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సేవా దళ్ మరింత కృషి చేయాలని తెలిపారు. వచ్చే ఐదేండ్లు కూడా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు సేవాదళ్ కష్టపడి పనిచేయాలని మధుయాష్కీ అన్నారు.

Read Also: ICC T20 Rankings: నెంబర్-1 ఆల్ రౌండర్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్..

వీహెచ్ మాట్లాడుతూ.. సేవాదళ్ 100 సంవత్సరాల వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సేవాదళ్ నుండి పండిట్ జవహర్ లాల్ నెహ్రు ప్రధాన మంత్రి అయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీలో సేవా దళ్ ది కీలక పాత్ర.. రాజీవ్ గాంధీ కూడా సేవాదళ్ నుండి వచ్చిన వ్యక్తి అని చెప్పారు. సేవాదళ్ మరిన్ని కార్యక్రమాలు చేయాలి.. గ్రామ స్థాయిలో కూడా కష్టాలలో ఉన్న వారికి సేవ చేయాలన్నారు. కష్టపడ్డ వారికి కాంగ్రెస్ లో అవకాశాలు ఉంటాయి.. సీఎం రేవంత్ రెడ్డి కష్ట పడ్డవారిని గుర్తించి అవకాశాలు కల్పిస్తారని వీహెచ్ తెలిపారు.

Show comments