Serial Killer: హడలెత్తిస్తున్న సీరియల్ కిల్లర్.. వృద్ధ మహిళలే లక్ష్యం, ఇప్పటివరకు 3 హత్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial Killer Targets Older Women: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని సీరియల్ కిల్లర్ సంచరిస్తున్నాడు. హంతకుల కోసం ఆరు పోలీసు బృందాలు వెతుకులాటలో నిమగ్నమయ్యాయి. అతను వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని చంపినట్లు ఆరోపణలు ఉన్నాయని బారాబంకి పోలీసులు తెలిపారు. ఈ సీరియల్ కిల్లర్ కొద్ది రోజుల వ్యవధిలో ముగ్గురు మహిళలను హత్య చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న హంతకుల కోసం ఆరు బృందాలు బారాబంకి పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు అనుమానితుడి ఫోటోను కూడా విడుదల చేశారు. అతని గురించి ఏదైనా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారిని తొలగించి ఆయన స్థానంలో మరో అధికారిని ఎస్పీ నియమించారు. మొదటి సంఘటన 5 డిసెంబర్ 2022న అయోధ్య జిల్లాలో నమోదైంది. మావాయి ప్రాంతంలోని ఖుషేతి గ్రామానికి చెందిన 60 ఏళ్ల బాధితురాలు ఏదో పని నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వెతకడం ప్రారంభించారు. అనంతరం డిసెంబర్ 6న ఏకాంత ప్రదేశంలో మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై బట్టలు కూడా లేవని పోలీసులు తెలిపారు. మహిళ ముఖం, తలపై గాయాల గుర్తులు ఉన్నాయి. పోస్టుమార్టం నివేదికలో మహిళపై అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు తేలిందని వారు తెలిపారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Breaking News: హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద అగ్నిప్రమాదం.. తగులబడుతున్న బస్సు
రెండవ సంఘటనలో, బారాబంకి జిల్లాలోని పొలంలో 62 ఏళ్ల మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె కూడా అదే పద్ధతిలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహంపై ఎలాంటి గుడ్డ లేదని, పోస్ట్‌మార్టం నివేదికలో ఆమెపై అత్యాచారం చేసి, ఆపై గొంతుకోసి చంపినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అదే విధంగా డిసెంబర్ 30న రామ్స్నేహిఘాట్ కొత్వాలికి 3 కి.మీ దూరంలోని తథార్హా గ్రామంలో 55 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. హత్యల తీరు ఇలాగే ఉందని అధికారులు తెలిపారు. మరణించిన మహిళలందరూ 50 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే. వీరంతా ఇదే విధంగా హత్యకు గురయ్యారు. ఇప్పటికే నిందితుడి ఫొటోను పోలీసులు ఇంటర్నెట్లో వైరల్ చేశారు. బారాబంకి, సమీప పోలీస్ స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. బారాబంకి పోలీసుల ఆరు బృందాలు ప్రస్తుతం హంతకుడి కోసం అన్వేషణలో నిమగ్నమై ఉన్నాయి. అయితే ఇప్పటివరకు, హంతకుడు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!