Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Serial Bride Sameera Fatima 9th Marriage Scam

15 ఏళ్లుగా నిత్య పెళ్లికూతురు.. లిస్టులో ఉన్నత చదువులు చదివినవారు! తొమ్మిదో పెళ్లికి రెడీ అయి

Published Date :August 2, 2025 , 10:31 pm
By Sampath Kumar
  • 15 ఏళ్లుగా నిత్య పెళ్లికూతురు
  • లిస్టులో ఉన్నత చదువులు చదివినవారు
  • 9వ భర్తను కలవడానికి వచ్చిన సందర్భంలో అరెస్ట్
15 ఏళ్లుగా నిత్య పెళ్లికూతురు.. లిస్టులో ఉన్నత చదువులు చదివినవారు! తొమ్మిదో పెళ్లికి రెడీ అయి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nagpur Serial Bride: అందం, తెలివి తేటలు రెండూ ఉన్నాయి. పైగా టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. కానీ తన అందాన్ని తెలివి తేటలను అమాయకులను మోసం చేయడానికి ఉపయోగించింది. పెళ్లిళ్ల పేరుతో చీటింగ్ చేస్తూ కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు 8 పెళ్లిళ్లు చేసుకుని.. చివరికి తొమ్మిదో పెళ్లికి రెడీ అయింది. కానీ దురదృష్టం వెంటాడడంతో పోలీసులకు చిక్కింది. ఇంతకీ ఆ మాయలేడీ ఎవరు ? ఆ కిలాడీ కథేంటి?

నిత్య పెళ్లికొడుకు.. వ్యవహారాలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తూ, బ్లాక్‌మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన స్టోరీలను ఎన్నో చూసుంటాం. కానీ ఎప్పుడు అబ్బాయి లేనా మేము మాత్రం తక్కువ కాదు అంటూ ఈ దందాకు తెరలేపింది ఓ కిలేడీ. ఇప్పటివరకు 8 పెళ్లిళ్లు చేసుకొని.. తొమ్మిదో పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో పోలీసులకు పట్టుబడింది.

ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న కిలాడీ లేడీ పేరు సమీరా ఫాతిమా. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ స్వస్థలం. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. కానీ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన సమీరా గాడి తప్పింది. 15 ఏళ్లుగా నిత్య పెళ్లికూతురుగా పలువురిని మోసం చేసింది పాతిమా. పెళ్లి చేసుకోవడం.. కాపురం చేస్తున్నట్లు నటించడం ఆ తర్వాత భర్తను బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడం సమీరా ఫాతిమా నైజం.

మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని మోసం చేస్తోంది ఫాతిమా. ఓ ఎమోషనల్ డ్రామాతో అమాయకులను బుట్టలో వేసుకుంటుంది. పెళ్లి తర్వాత భర్తను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తుంది. అవసరమైతే బలవంతంగా డబ్బు వసూలు చేసేలా ఓ టీమ్‌ని కూడా సెట్ చేసింది. అలా ఈమె బారిన పడ్డ ఓ బాధితుడు.. తన నుంచి 50 లక్షలు బలవంతంగా వసూలు చేసిందని ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. సమీరా ఫాతిమా లిస్టులో ఉన్నత చదువులు చదివినవారు, రిజర్వ్ బ్యాంక్ సీనియర్ అధికారి సైతం ఉండడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.

భర్తను సెలెక్ట్ చేయడంలో సమీరా ఫాతిమా స్టైలే వేరు. ముందుగా డబ్బున్న, పెళ్లికాని పురుషుల వివరాలను.. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ద్వారా సేకరించి స్నేహం పెంచుకుంటుంది. ఆ తర్వాత తాను విడాకుల తీసుకున్నానని.. ఒక చిన్నపిల్లను చూసుకుంటున్నానని ఎమోషనల్ స్టోరీ చెబుతుంది. వివాహం అయిన అనంతరం కొంతకాలం బాగున్నట్టు నటిస్తుంది. చివరగా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కాజేస్తుంది. జూలై 29న నాగ్‌పూర్‌లోని ఓ టీ దుకాణం వద్ద 9వ భర్తను కలవడానికి వచ్చిన సందర్భంలో.. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆమెకు సహకరించే ముఠాలోని ఇతర సభ్యుల వివరాల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • Nagpur
  • Sameera Fatima
  • serial bride
  • Serial Bride Busted

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions