నిన్నుకోరి, మజిలి వంటి సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ ఖుషి ప్లాప్ తో కాస్త స్లో అయ్యాడు. కాస్త లాంగ్ గ్యాప్ తీసుకుని మరొక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ మహారాజ రవితేజ హీరోగా సినిమా చేయబోతున్నాడు. కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. థ్రిలర్ జానర్ లో ఈ సినిమా రాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారక ప్రకటన రాబోతుంది.
Also Read : Tollywood : హిట్ దర్శకులను రిపీట్ చేస్తున్న టాలీవుడ్ హీరోలు
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమాకు ఓ సెన్సిటివ్ టైటిల్ అనుకుంటున్నారట. వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే పేరు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం ఒక తండ్రి పడే తాపత్రయం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. అందుకు తగ్గట్టుగా ఇరుముడి టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ డిసెంబరు చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ ను ముగించే పనిలో ఉన్నాడు రవితేజ. అటు శివ నిర్వాణకు ఇటు మాస్ మహారాజకు ఇరుముడి సినిమా చాల కీలకం. ఇద్దరు ప్లాప్స్ లో ఉన్నారు భారీ కమర్షియల్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది.