Hyd Sarogacy: అడ్డదారుల్లో వెళ్తుంటే అడ్డుకోవాల్సిన తల్లే.. కొడుకు, కూతురుతో అక్రమ దందా చేయిస్తూ..
- హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడుతూ ముంబై పోలీసులకు చిక్కిన లక్ష్మీరెడ్డి
- ఆ కేసులో లక్ష్మీరెడ్డికి జైలు శిక్ష
- ఆ తర్వాత మకాం హైదరాబాద్‌కు మార్చిన లక్ష్మీరెడ్డి
- మహిళకు రెండు కిడ్నీలు పాడయ్యాయని తెలుసుకున్న లక్ష్మీరెడ్డి
- సర్జరీ చేయిస్తానని హామీ ఇచ్చిన లక్ష్మీరెడ్డి
- సరోగసీ పద్ధతిలో బిడ్డను కని ఇవ్వాలని ఒప్పందం
- సరోగసీకి ఒప్పుకోని మహిళ భర్త
- దంపతులతో గొడవ పెట్టుకున్న లక్ష్మీ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొడుకు.. కూతురు.. అడ్డదారుల్లో వెళ్తుంటే అడ్డుకోవాల్సిన తల్లే.. వాళ్లతో అక్రమ దందా చేయించింది. కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన కొడుకును.. తాను చేసే కంత్రీ పనుల్లో భాగం చేసింది. ఇల్లు చక్కదిద్దుకోవడమెలా అని నేర్పించాల్సిన కూతురికి ఇల్లీగల్ పనులు అప్పజెప్పింది. పేదింటి మహిళలతో తప్పుడు పనులు చేయిస్తూ… డబ్బులు వెనకేసుకుంది. ఇంతకూ ఎవరా కిలేడీ…? మేడ్చల్ కమర్షియల్ సరోగసి కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే అంశాలేంటి..?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
మేడ్చల్ పరిధిలోని పేట్ బషీరాబాద్‌లో కమర్షియల్ సరోగసి.. అక్రమ ఎగ్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న కేసు వేగవంతం చేశారు పోలీసులు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లక్ష్మీరెడ్డి చేసిన అక్రమ బాగోతమంతా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తాను చేసే ఇల్లీగల్ దందాలో కొడుకు, కూతురును కూడా భాగస్వామ్యులను చేసినట్లు గుర్తించారు పోలీసులు…
Also Read:Film Federation: చర్చలకు పిలిపు.. నిరసన తాత్కాలిక నిలుపుదల..
ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీరెడ్డి.. హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడుతూ ముంబై పోలీసులకు పట్టుబడింది. ఈ కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చింది. ఈసారి మకాం హైదరాబాద్‌కి మార్చింది. అమీర్‌పేట్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, మాదాపూర్ ప్రాంతాల్లో ఉన్న ఐవీఎఫ్ సెంటర్లు, కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లతో పరిచయం పెంచుకుంది. అండాలు కావాలన్నా… సరోగసి కోసం అద్దె గర్భానికి మహిళలు కావాలన్నా అరేంజ్ చేస్తానని హాస్పిటళ్లు, ఐవీఎఫ్ సెంటర్లకు ఏజెంట్‌గా వ్యవహరించింది. ఈ దందాలో తన కొడుకు, కూతురును కూడా కలుపుకుంది.
Also Read:Akhanda 2: అఖండ 2 తాండవం ఆడించే ఓటీటీ ఫిక్స్?
ఇలా గుట్టుచప్పుడు కాకుండా.. అక్రమ ఎగ్ ట్రేడింగ్, కమర్షియల్ సరోగసి నడుపుతూ.. లక్షల రూపాయలు వెనకేసుకుంది లక్ష్మీరెడ్డి. ఇదే క్రమంలో ఆమెకు ఓ మహిళ పరిచయం అయింది. ఆ మహిళకు రెండు కిడ్నీలు పాడయ్యాయని.. సర్జరీ చేయాల్సి ఉందని తెలుసుకుంది లక్ష్మీ. ఇదే అదునుగా… లక్ష్మీరెడ్డి ఓ కంత్రీ ప్లాన్ వేసింది. సర్జరీకి అయ్యే ఖర్చంతా తాను పెట్టుకుంటానని.. ఐతే ఆరోగ్యం కుదుటపడ్డాక సరోగసి పద్ధతిలో ఓ బిడ్డను కనివ్వాలని ఒప్పందం చేసుకుంది. ఇందుకు మహిళ కూడా ఒప్పుకుంది.
Also Read:Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాలతో కిరణ్ అబ్బవరం?
అనుకున్నవిధంగా లక్ష్మి… తన సొంత డబ్బుతో మహిళకు కిడ్నీ ఆపరేషన్ చేయించింది. కొన్ని రోజుల్లో ఆ మహిళ కోలుకుంది. ఒప్పందం ప్రకారం సరోగసి పద్ధతిలో బిడ్డను కనివ్వాలని కోరింది లక్ష్మి. విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త.. ఇందుకు నిరాకరించాడు. కావాలంటే ఆపరేషన్‌కు అయిన డబ్బంతా తిరిగి ఇస్తామని.. సరోగసీకి మాత్రం ఒప్పుకోమని అన్నాడు. దీంతో.. ఆ దంపతులతో గొడవ పెట్టుకుంది లక్ష్మి. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు మహిళ భర్త. లక్ష్మి పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లక్ష్మి ఇంట్లో సోదాలు చేశారు.
Also Read:Cyber Crime: సైబర్ నేరాలపై కేంద్ర హోంశాఖ స్పెషల్ ఫోకస్.. రూ.5489 కోట్లు స్వాధీనం
పెంట్ హౌజ్‌లో ఆరుగురు గర్భిణీలు
అప్పుడు కానీ.. అసలు బాగోతం బయటపడలేదు. లక్ష్మీ ఇంటికి సోదాలకు వెళ్లిన పోలీసులు షాక్ అయ్యారు. ఇంటి మేడ మీద ఉన్న పెంట్ హౌజ్‌లో ఆరుగురు మహిళలను గుర్తించారు. అందులో ఇద్దరు 8 నెలల గర్భంతో ఉన్నారు. ఆరా తీస్తే.. వాళ్లంతా సరోగసి కోసం లక్ష్మీ ఎంగేజ్ చేసిన మహిళలుగా గుర్తించారు. సరోగసి పద్ధతిలో బిడ్డలను కనిచ్చేందుకు మహిళలను వివిధ ప్రాంతాల నుంచి లక్ష్మి తీసుకొచ్చినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. మేడ్చల్ DM అండ్ HOకి సమాచారం ఇచ్చారు పోలీసులు. లక్ష్మి ఇంట్లో పెద్ద ఎత్తున ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు, పలు హాస్పిటల్స్‌కి చెందిన మెడికల్ రిపోర్ట్‌లు, ఓపీ షీట్లు స్వాధీనం చేసుకున్నారు. పెంట్ హౌజ్‌లో ఓ లేడీస్ హాస్టల్ ను తలపించే సెటప్ చూసి అవాక్కయ్యారు పోలీసులు.
Also Read:Cyber Crime: సైబర్ నేరాలపై కేంద్ర హోంశాఖ స్పెషల్ ఫోకస్.. రూ.5489 కోట్లు స్వాధీనం
ఇంట్లో ఓ డైరీ, కొన్ని నోట్ బుక్స్ స్వాధీనం
లక్ష్మి.. తన ఇంటి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న రూమ్‌లను కేవలం బ్యాచ్‌లర్స్‌కి మాత్రమే అద్దెకు ఇస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. బ్యాచ్‌లర్ యువతీ యువకులను మచ్చిక చేసుకుని.. వాళ్లకు డబ్బు ఆశ చూపి వీర్యం, అండాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అద్దెకు ఉన్న వాళ్లను కూడా విచారిస్తున్నారు పోలీసులు. ఇంట్లో ఓ డైరీ, కొన్ని నోట్ బుక్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇప్పటివరకు 50 మంది మహిళలతో సరోగసి పద్దతిలో పిల్లలను కని ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు.
Also Read:కళ్లు చెదిరే అందాలతో హీట్ పుట్టిస్తున్న దిశా పటాని.
తన సంరక్షణలో ఉన్న ఏ మహిళ ఎప్పుడు గర్భవతి అయ్యింది.. ఎప్పుడు డెలివరీ అయ్యింది.. ఎంత డబ్బు ఇచ్చాను.. అనేది పూర్తి వివరాలు డైరీ లో నోట్ చేసుకుంది లక్ష్మి. తన సంరక్షణలో ఉన్న మహిళలకు హిందీ భాషపై శిక్షణ కూడా ఇస్తోంది. రెగ్యులర్‌గా మాట్లాడే మాటలను కొన్ని హిందీలో మాట్లాడేలా ట్రైనింగ్ ఇస్తోంది లక్ష్మి. సరోగసి కోసం ఎక్కువ శాతం నార్త్ ఇండియా దంపతులే వస్తుండటంతో.. వాళ్లకు అద్దె గర్భం ఇచ్చే మహిళ కూడా నార్త్ ఇండియాకి చెందినామే అని నమ్మించేందుకు హిందీ నేర్పిస్తోంది.
Also Read:Film Federation: చర్చలకు పిలిపు.. నిరసన తాత్కాలిక నిలుపుదల..
లక్ష్మి రెడ్డి ఏజెంట్ వ్యవహరిస్తున్న 6 ప్రైవేట్ హాస్పిటళ్లు, ఐవీఎఫ్ సెంటర్లను గుర్తించారు పోలీసులు. వీటికి నోటీసులు ఇచ్చారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మాదాపూర్‌లోని హెగ్డే ఫెర్టిలిటీ హాస్పిటల్, సోమాజిగూడలోని అను టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బంజారాహిల్స్‌లోని ఫెర్టీ కేర్, ఈవీఏ ఐవీఎఫ్ సెంటర్, అమూల్య ఐవీఎఫ్ సెంటర్, కొండాపూర్ లోని శ్రీ ఫెర్టిలిటీ సెంటర్‌లకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇప్పటికే అరెస్ట్ ఐన లక్ష్మీరెడ్డి, ఆమె కొడుకు నరేందర్ రెడ్డిలను కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు పోలీసులు. కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. లక్ష్మిఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీ ఇప్పుడు కీలకం కాబోతుంది. అందులోని డేటా ఆధారంగా మరికొందరి బాగోతం బయటపడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!