Site icon NTV Telugu

Madanapalle Kidney Racket: మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు.. ఒక్కో కిడ్నీ పాతిక లక్షలకు

Mdanapalle Kidney Rocket

Mdanapalle Kidney Rocket

అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరమే కానీ, డబ్బు సంపాదించేందుకు మానవ అవయవాలతో వ్యాపారం చేయడం తప్పే కదా. అమాయకులకు డబ్బు ఎరగా చూపి దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు సంచలనం సృష్టిస్తోంది. నిందితుల రిమాండ్ రిపొర్టు‌ లో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. రెండు అక్రమ కిడ్నీ ఆపరేషన్లను గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు ఒక్కో కిడ్నీ నీ పాతిక లక్షల అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు.

Also Read:Andhra Pradesh:విశాఖలో మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ హోటల్ ప్రాజెక్ట్.. 2000 మందికి ఉపాధి

కిడ్నీ దాత కావాలంటూ మదనపల్లె డయాలసిస్ సెంటర్ లో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న బాలు, కదిరి డయాలసిస్ సెంటర్ టెక్నీసియాన్ మెహరాజ్ లను పార్థసారథి రెడ్డి కోరాడు. వైజాగ్ జిల్లా గాజువాక కు చెందిన బ్రోకర్లు పద్మ, కాకర్ల సత్య, సూరిబాబుతో బాలు, మెహరాజ్ సంప్రదింపులు జరిపారు. వైజాగ్ చెందిన హారిక, యమునా తో ఆరు లక్షల రూపాయలు ఒప్పందం కుదిర్చిన బ్రోకర్లు.. కిడ్నీ ఆపరేషన్ చేయడానికి గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ ఆంజనేయులకు ఒక్కో ఆపరేషన్ కు ఐదు లక్షల ఇచ్చేలా పార్థసారథి రెడ్డి డీల్ కుదుర్చుకున్నారు.

తొలిగా ఈనెల తొమ్మిదివ తేది ఉదయం వైజాగ్ కు చెందిన హారిక అనే యువతి కిడ్నిని తొలగించి మదనపల్లె చెందిన ముబాషిరా అమర్చడం ద్వారా 25 లక్షలు పొందారు నిందితులు. వచ్చిన డబ్బుల్లో డా. అంజనేయులు – రూ.5.5 లక్షలు, డా. పార్థసారథి – రూ. 4 లక్షలు, దాత హారిక – రూ. 6 లక్షలు మిగిలిన డబ్బును పంచుకున్న మెహరాజ్,బాలు. మరో కిడ్నిని సాయంత్రం యమున కు ఆపరేషన్ చేసి తొలగించారు పార్థసారథి రెడ్డి.. కిడ్నీ ఆపరేషన్ తర్వాత నొప్పి తట్టుకోలేక యమునా మృతి చెందింది. యమునా మృతి చెందడంతో గుట్టుచప్పుడు కాకుండా మదనపల్లి నుండి తిరుపతికి మృతదేహాన్ని తరలించారు. యమునతో సహజీవనం చేస్తున్న సూరిబాబుకు ఆరు లక్షల రూపాయల డబ్బులు ఇస్తామని ఇవ్వకపోవడం, యమునా మృతి చెందిందని చెప్పడంతో ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చాడు సూరిబాబు..

Also Read:India WTC Ranking Drop: భారత్‌కు ఓటమి ఎఫెక్ట్.. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఎన్ని పాయింట్లు కోల్పోయిందంటే.. !

పోలీసులకు సూరిబాబు సమాచారం ఇవ్వడంతో కిడ్నీ అమ్మకం వ్యవహారం బయటపడింది. తొలుత యమునకు పరీక్షలు నిర్వహించిన ఆంజనేయులు ఆమె శరీరం కిడ్నీ ఇవ్వడానికి సరిపోదంటూ తిప్పి పంపారు. అరెస్టు చేసిన వారిచ్చిన సమాచారంతో మరో 8 మంది పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటివరకు 15మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.. కేసులో కీలక నిందితుడిగా ఉన్న డాక్టర్ పార్థసారధి రెడ్డి కోసం తమిళనాడు, కర్నాటక, రాష్ట్రాల్లో గాలిస్తున్నారు పోలీసులు. యమునా కిడ్నీనీ గోవాకు చెందిన కిడ్నీ పేషంట్ రాజన్ దామోదర్ నాయక్ కు అమర్చినట్లు సమాచారం.

Exit mobile version