Site icon NTV Telugu

APPSC Scam: ఏపీపీఎస్సీ గ్రూపు 1 కేసు.. రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులుకు అస్వస్థ..!

Psr Anjaneyulu

Psr Anjaneyulu

ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్‌ అధికారి‌ పీఎస్సార్ ఆంజనేయులు అస్వస్థతతకు గురైనట్లు తెలిసింది. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న సీఎస్సార్‌కు ఉదయం బిపీ హెచ్చు తగ్గులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎకో తీయించడంతో గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గుండె జబ్బులకు సంబంధించి స్పెషల్ వార్డులో పీఎస్సార్ ఆంజనేయులును ఉంచారు. ప్రస్తుతం వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.

READ MORE: PM Modi: భారతదేశ చరిత్రలోనే ‘‘సిందూర్’’ విజయవంతమైన యాంటీ-టెర్రర్ ఆపరేషన్..

కాగా.. గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకన కుంభకోణం కేసు విచారణలో ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో విజయవాడలోని సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్​ఐఆర్​లో సీనియర్‌ ఐపీఎస్‌ పీఎస్సార్ ఆంజనేయులును ఏ1గా, క్యామ్‌సైన్‌ సంస్థ డైరెక్టర్ మధుసూదన్ A2గా చేర్చారు. ఇటీవలకస్టడీకి తీసుకుని విచారించారు.

READ MORE: Gulzar House Incident: గుల్జార్ హౌస్ బాధితుల ఆరోపణలపై స్పందించిన అగ్నిమాపక శాఖ

నిబంధనలకు పూర్తి విరుద్ధంగా కొటేషన్‌ విధానంలో మూల్యాంకన బాధ్యతలను పొందిన క్యామ్‌సైన్‌ సంస్థ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా రుజువైంది. గ్రూప్‌-1 జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో పీఎస్సార్ ఆంజనేయులు చెప్పినట్లే నడుచుకున్నానని, నిబంధనలకు విరుద్ధంగా చేయకూడదని చెప్పినా ఆయన వినలేదని ఏపీపీఎస్సీ కాన్ఫిడెన్షియల్‌ విభాగం సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య ఇప్పటికే విచారణలో వెల్లడించారు.

Exit mobile version