Site icon NTV Telugu

Hero Suman: అల్లు అర్జున్ ఎఫెక్ట్‌తో సీనియర్ హీరో సుమన్ విజిట్ రద్దు

Hero Suman

Hero Suman

Hero Suman: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎఫెక్ట్‌తో సీనియర్ హీరో సుమన్ నంద్యాల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించిన సంగతి తెలిసిందే. నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి ఇంటికి అల్పాహారానికి అల్లు అర్జున్‌ వచ్చారు. అల్లు అర్జున్ వచ్చినప్పుడు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. యన పర్యటనకు అధికారిక అనుమతులు లేకపోవడంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అల్లు అర్జున్, ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్‌రెడ్డిపై కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ రాజారెడ్డిలు ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే.

Read Also: Payal Rajput: ప్రభాస్‌ చాన్స్ ఇస్తే నా కోరిక తీర్చుకుంటా.. హీరోయిన్ హాట్ కామెంట్స్..

ఇదిలా ఉండగా.. షోరూం ప్రారంభానికి సీనియర్ నటుడు సుమన్‌ను ఓ ప్రైవేట్ సంస్థ ఆహ్వానించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చే ఛాన్స్ ఉందని ఆర్గనైజర్స్ భావించారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఎపిసోడ్ రిపీట్ అయితే ఇబ్బందులు తప్పవని సుమన్ పర్యటనను నిర్వాహకులు రద్దు చేశారు.

Exit mobile version