Kodak MotionX Series: కోడాక్ (Kodak) కంపెనీ కొత్తగా టీవీలలో సరికొత్త మోషన్ఎక్స్ (MotionX) సిరీస్ ను విడుదల చేసింది. ఈ లేటెస్ట్ టెలివిజన్ మోడల్స్ 55, 65, 75 అంగుళాలలో మూడు సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీలు QLED 4K డిస్‌ప్లేలను కలిగి ఉండి 1.1 బిలియన్ రంగులను ప్రదర్శిస్తాయి. దీనితో కళ్లు చెదిరే విజువల్ అనుభవాన్ని అందిస్తాయి. ఇవి HDR10+, డాల్బీ విజన్ (Dolby Vision) టెక్నాలజీలకు మద్దతు ఇస్తాయి. మీ లివింగ్ రూమ్‌లోనే సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తాయి.
Australia: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 నెలల భారతీయ గర్భిణీ మృతి
ఇక శబ్దం విషయానికి వస్తే ఈ టీవీలు 70W డాల్బీ ఆడియో స్టీరియో బాక్స్ స్పీకర్స్‌తో వస్తాయి. వీటిలో డాల్బీ అట్మాస్ (Dolby Atmos) టెక్నాలజీని చేర్చడం వల్ల సౌండ్ క్వాలిటీ మరింత మీరు థియేటర్‌లో ఉన్న అనుభూతిని అందిస్తుంది. సినిమాలు చూసినా.. లేదా ఆటలు ఆడినా, ఆడియో అనుభవం అత్యుత్తమంగా ఉండేలా దీనిని రూపొందించారు. గేమర్లు, క్రీడాభిమానుల కోసం 120Hz MEMC (మోషన్ ఎస్టిమేషన్ మోషన్ కాంపెన్సేషన్)తో పాటు VRR (వేరియబుల్ రిఫ్రెష్ రేట్), ALLM (ఆటో లో లాటెన్సీ మోడ్) వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.
Tollywood : ఈ శుక్రవారం థియేటర్స్ లో 11 సినిమాలు రిలీజ్ కు రెడీ.. హిట్ కొట్టే సినిమా ఎదో?
ఈ టీవీలు Google TV 5.0 ప్లాట్‌ఫారమ్ పై పనిచేస్తాయి. ఇందులో క్రోమ్ క్యాస్ట్, ఎయిర్ ప్లే మద్దతు ఉండటం ద్వారా వినియోగదారులు తమ డివైజ్‌ల నుండి కంటెంట్‌ను సులభంగా టీవీ స్క్రీన్‌కు స్ట్రీమ్ చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా 10,000 కంటే ఎక్కువ యాప్‌లకు, 500,000 కంటే ఎక్కువ టీవీ షోలకు యాక్సెస్‌ను అందిస్తుంది. హార్డ్‌వేర్ పరంగా ఇవి MT9062 ప్రాసెసర్, 2GB ర్యామ్, 32GB ROMతో పనిచేస్తాయి. ఇక ధరల విషయానికి వస్తే.. 55 అంగుళాల QLED టీవీ రూ. 31,999, 65 అంగుళాల QLED టీవీ రూ. 43,999, 75 అంగుళాల QLED టీవీ రూ. 64,999గా నిర్ణించబడింది. కోడాక్ మోషన్ఎక్స్ సిరీస్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.