Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాద ఘటన
- సెల్ఫీలు తీసుకుంటూ ముగ్గురు యువతులు మృతి
- అనంతగిరి మండలం మల్లంగుమి గ్రామం సమీప జలపాతం వద్ద ప్రమాదం
- నలుగురు యువతులు జలపాతానికి వెళ్లిన సమయంలో ప్రమాదం
- జారి నీటిలో పడిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Selfie Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ సరదా ముగ్గురు యువతుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణ ఘటన అనంతగిరి మండలం మల్లంగుమి గ్రామ సమీపంలోని జలపాతం వద్ద జరిగింది. అందిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలో ఉన్న జలపాతానికి వెళ్లిన నలుగురు యువతులు సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదానికి గురయ్యారు. ఈ క్రమంలో వారు అక్కడ అదుపు తప్పి జారి నీటిలో పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు యువతులు మృతి చెందగా, మరో యువతిని స్థానికులు సాహసంగా రక్షించారు.
Also Read
- AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
- Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
- Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
మృతులను బూర్జ పంచాయతీ పరిధిలోని జంబువలస గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ జలపాతం అనంతగిరి, హుకుంపేట మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల సహాయక చర్యలు కాస్త ఆలస్యంగా జరిగాయని తెలుస్తోంది. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
ICC: టెస్ట్ క్రికెట్కు కొత్త ఊపిరి.. WTC ఫార్మాట్ మార్పులకు రంగం సిద్ధం..!
తాజావార్తలు
-
AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!