Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!

  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాద ఘటన
  • సెల్ఫీలు తీసుకుంటూ ముగ్గురు యువతులు మృతి
  • అనంతగిరి మండలం మల్లంగుమి గ్రామం సమీప జలపాతం వద్ద ప్రమాదం
  • నలుగురు యువతులు జలపాతానికి వెళ్లిన సమయంలో ప్రమాదం
  • జారి నీటిలో పడిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి..
Selfi

Selfi

Selfie Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ సరదా ముగ్గురు యువతుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణ ఘటన అనంతగిరి మండలం మల్లంగుమి గ్రామ సమీపంలోని జలపాతం వద్ద జరిగింది. అందిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలో ఉన్న జలపాతానికి వెళ్లిన నలుగురు యువతులు సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదానికి గురయ్యారు. ఈ క్రమంలో వారు అక్కడ అదుపు తప్పి జారి నీటిలో పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు యువతులు మృతి చెందగా, మరో యువతిని స్థానికులు సాహసంగా రక్షించారు.

Adivi Sesh: వాళ్ళకి ఈలలు, కేకలు వేసి నా సినిమాకి టికెట్లు కొన్నారు.. హీరోలపై శేష్ సెన్సేషనల్ కామెంట్స్

మృతులను బూర్జ పంచాయతీ పరిధిలోని జంబువలస గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ జలపాతం అనంతగిరి, హుకుంపేట మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల సహాయక చర్యలు కాస్త ఆలస్యంగా జరిగాయని తెలుస్తోంది. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

ICC: టెస్ట్ క్రికెట్‌కు కొత్త ఊపిరి.. WTC ఫార్మాట్ మార్పులకు రంగం సిద్ధం..!