NTV Telugu Site icon

T20 World Cup 2024: ప్రపంచకప్‌కు అతడిని సెలక్ట్ చేయండి.. బీసీసీఐకి షారుక్ ఖాన్ విజ్ఞప్తి!

Shah Rukh Khan

Shah Rukh Khan

Shah Rukh Khan Wants to see Rinku Singh in India T20 World Cup 2024 Squad: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. అయితే ఇప్పటివరకు కూడా భారత జట్టుపై సరైన స్పష్టత లేదు. దాంతో జట్టులో చోటు ఎవరికి దక్కుతుంది?, ఎవరిపై వేటు పడుతుంది? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో బాలీవుడ్‌ బాద్‌ షా, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సహయజమాని షారుఖ్‌ ఖాన్‌.. బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేశారు.

భారత టీ20 ప్రపంచకప్ జట్టుకు యువ ఆటగాడు రింకూ సింగ్‌ను ఎంపిక చేయాలని షారుఖ్‌ ఖాన్‌ కోరారు. స్టార్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ మాట్లాడుతూ… ‘అద్భుతమైన ప్లేయర్స్ దేశం కోసం ఆడుతున్నారు. రింకూ సింగ్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడి దయవల్ల అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి. అందుకోసం ఎదురుచూస్తున్నా. ఇతర జట్లకు చెందిన మరికొందరు యువకులు కూడా జట్టులో భాగం కావాలి. చాలా మంది ప్లేయర్స్ ఇందుకు అర్హులు. కానీ రింకూ జట్టులో ఉండాలని ఆశిస్తున్నా. అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. అది నాకు గొప్ప విషయం’ అని అన్నారు.

Also Read: Shah Rukh Khan-Ganguly: సౌరవ్ గంగూలీని ఆశ్చర్యపరిచిన షారుఖ్.. వీడియో వైరల్!

‘కస్టపడి పైకి వచ్చిన వారు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. కుర్రాళ్లు ఆడే సమయంలో నేను కూడా క్రీడాకారుడిగా గొప్ప అనుభూతి చెందుతుంటా. రింకూ సింగ్, నితీశ్ రాణా లాంటి ఆటగాళ్లలో నన్ను నేను చూసుకుంటా. వాళ్లు మంచి ప్రదర్శన చేస్తే ఎంతో సంతోషిస్తా’ అని షారుఖ్‌ ఖాన్‌ తెలిపారు. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి ఓవర్‌లో అద్భుతమైన విజయం సాధించింది. 20వ ఓవర్‌లో రింకు వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో అతడు బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ సీజన్‌లో 474 పరుగులతో ఆకట్టుకున్న రింకూ.. టీమిండియాలోకి అరంగేట్రం చేసాడు. భారత్ తరఫున 15 టీ20ల్లో రెండు అర్ధ సెంచరీలతో 356 రన్స్ చేశాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ 2024కు గట్టి పోటీ దారుడుగా ఉన్నాడు.

Show comments