NTV Telugu Site icon

Smuggling : ఎయిర్ పోర్టుల్లో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టివేత

Gold

Gold

Smuggling : కలకత్తా అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న కరెన్సీ విలువ దాదాపు 33లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా 40 వేల అమెరికన్ కరెన్సీ ని గుట్కా ప్యాకెట్స్ దాచి తరలించేందుకు ప్రయత్నం చేశాడు కేటుగాడు. కానీ అధికారులు నిర్వహించిన స్కానింగులో కరెన్సీ అక్రమ రవాణా గుట్టు రట్టయింది. ఈ కరెన్సీని కోల్ కతా నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ప్రయాణికుడి వద్ద అధికారులు గుర్తించారు. కాటన్ బాక్స్‎లో గుట్కా ప్యాకెట్స్ నడుమ అతడు ప్యాకింగ్ చేశాడు. గుట్కా ప్యాకెట్స్ లో కరెన్సీ నోట్లను పెట్టి తిరిగి యథావిధిగా ప్యాకింగ్ చేశాడు. ఇందుకు గాను అధికారులు అతడిని అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిపై అక్రమ కరెన్సీ రవాణా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: China Corona : పాలకుల పాపం.. ప్రజలకు శాపం.. చైనాలోని ప్రావిన్స్‎లో 90శాతం మందికి కరోనా

ఇదిలా ఉండగా.. తమిళనాడులోని తిరుచిరాపల్లి ఎయిర్​పోర్ట్​లో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 20 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ బంగారాన్ని పొడి చేసి చాక్లెట్ పౌడర్ డబ్బాలో కలిపి తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. 211 గ్రాముల బంగారాన్ని పొడి చేసి​ మూడు చాక్లెట్ పౌడర్ డబ్బాల్లో కలిపి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్​ఇండియా విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేస్తున్న సమయంలో ఈ బంగారం లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. ప్రయాణికుడి చెక్​-ఇన్ బ్యాగేజీలో కూడా 175 గ్రాముల బంగారు గొలుసులు కూడా లభించాయని వెల్లడించారు. మొత్తం బంగారం విలువ రూ.21.55 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.