Site icon NTV Telugu

Minister Seethakka : గొర్రెల స్కామ్‌పై సీతక్క ధ్వజం.. కేసీఆర్ పాలనలో స్కాములపై కఠిన చర్యలు తప్పవు..

Seethakka

Seethakka

Minister Seethakka : తెలంగాణలో అవినీతి దోపిడి చేసినవారిపై ఉక్కుపాదం మోపాలని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బత్తులపల్లిలో పర్యటించిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో స్కీముల పేరుతో భారీ స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు. గొర్రెల పంపిణీ పథకం కింద పేదల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని ముక్కుపిండి తిరిగి ఆ డబ్బులు రికవరీ చేస్తాం అంటూ సీతక్క ఘాటుగా స్పందించారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా, వినూత్నంగా అమలు చేయబోతోందని ఆమె స్పష్టం చేశారు.

Bhatti Vikramarka : కేంద్ర కులగణన ప్రకటనపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

అంతేకాదు.. కేసీఆర్ హయాంలో స్కీమ్‌లన్నీ స్కామ్‌లుగా మారాయి. అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదు. ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న ప్రతీ ఒక్కరిని చట్టం ఎదుటకి తీసుకొస్తాం అంటూ హెచ్చరించారు. అదే సమయంలో రామప్ప ఆలయం వరల్డ్ హెరిటేజ్‌గా గుర్తింపు పొందిన నేపధ్యంలో ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులకు ఆహ్వానం పంపినట్లు కూడా వెల్లడించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిద్దాం అని ఆమె పిలుపునిచ్చారు.

Karumuri Nageswara Rao: ప్రధాని మోడీ ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ, పవన్‌కి చాక్లెట్‌ ఇచ్చారు..!

ఇక గొర్రెల స్కామ్‌కు సంబంధించి ఏసీబీ (ACB) దర్యాప్తు వేగం పుంజుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మొయినుద్దీన్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల్లో అతని ఖాతా నుంచి భార్య ఖాతాకు భారీగా నిధులు బదిలీ అయినట్లు గుర్తించారు. అయితే ఈ స్కామ్‌లో మొయినుద్దీన్‌తో పాటు ఆయన కుమారుడు ఇక్రముద్దీన్ కూడా కీలక పాత్ర పోషించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉండటంతో వారిని పట్టుకునేందుకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. విచారణ మరింత దిశగా సాగుతుండగా, నిందితుల అరెస్టు కోసం చర్యలు కొనసాగుతున్నాయి.

Exit mobile version