Site icon NTV Telugu

Seetha Ramam Part 2: సీతారామం-2 షురూ.. సీక్వెల్‌పై అప్‌డేట్ వైరల్!

Seetharamam 2

Seetharamam 2

టాలీవుడ్‌లో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన ‘సీతారామం’ సినిమాను ఎవరూ మర్చిపోలేరు. రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్ పండించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యరు. స్టోరీ తగ్గట్టుగానే పాటలు కూడా ప్రతి ఒక్కరికి ప్లే బ్యాక్ లిస్ట్ లోకి చేరిపోయాయి. అయితే ఇప్పుడు ఈ కాంబో గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదే ‘సీతారామం-2’! అవును, ఈ బ్లాక్ బస్టర్ జోడీ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Also Read : Arijith Singh : మ్యూజిక్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అర్జిత్ సింగ్!

రీసెంట్‌గా ఈ సినిమా సీక్వెల్ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దుల్కర్ సల్మాన్.. మృణాల్ ఠాకూర్ మళ్ళీ కలిసి నటించబోతున్నారని,ఇది ‘సీతారామం’ సినిమాకు కొనసాగింపుగా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. మొదటి భాగంలో వీరి మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.ఇక ఇప్పుడు పార్ట్-2 వార్త వినగానే ఫ్యాన్స్ ఖూషీతో ఎగిరి గంతేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే బాక్సాఫీస్ దగ్గర మరోసారి ప్రేమ వర్షం కురవడం ఖాయం. ఇక దర్శకుడు హను రాఘవపూడి మళ్ళీ ఈ ఇద్దరినీ ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ వార్త అధికారికంగా కన్ఫర్మ్ అవ్వాలని, రామ్-సీతల అందమైన ప్రేమకథను మళ్ళీ తెరపై చూడాలని నెటిజన్లు కామెంట్‌ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ ‘బ్లాక్ బస్టర్ కాంబో’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి!

Exit mobile version