Manish Sisodia: 103 రోజుల తర్వాత తన భర్తను కలుసుకున్న మనీష్ సిసోడియా భార్య.. భావోద్వేగ లేఖ విడుదల చేసిన సీమా సిసోడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా 103 రోజుల తర్వాత తన భర్తను కలిసింది. మనీష్ సిసోడియా ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా తన జీవిత భాగస్వామిని కలవడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. దాదాపు 7 గంటల పాటు వాళ్లిద్దరూ కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఆమే భావోద్వేగానికి గురయ్యారు.
Read Also: GPS vs CPS: సీపీఎస్ వర్సెస్ జీపీఎస్.. ఏపీలో ఇదే హాట్ టాపిక్..!
Also Read
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్‌కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్‌గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
మరోవైపు మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. సీమా సిసోడియా తన నివాసంలోనే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 103 రోజుల తర్వాత తన భర్తను కలుసుకున్నానంటూ ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంతకాలం తరువాత తాము కలుసుకుంటే మనీష్ కార్యక్రమాలపై నిఘా కోసం తమ బెడ్రూమ్ ప్రవేశద్వారం వద్ద పోలీసులు కాపలాగా ఉన్నారని, రాజకీయాలను మురికితో పోల్చింది అందుకేనని వాపోయారు. రాజకీయాల్లోకి వెళ్లవద్దని తన బంధువులు, శ్రేయాభిలాషులు మనీష్‌కు సలహా ఇచ్చిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుకు చేసుకున్నారు. రాజకీయాలపై మక్కువ ఉన్నప్పటికీ మనీష్ జర్నలిస్టు వృత్తిని ఎంచుకున్నారని, ప్రస్తుత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పార్టీ ఏర్పాటు చేశారని అన్నారు.
Read Also: Uttarapradesh : అమానుషం..అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక మృతి..
జైలులో తన భర్త పడుతున్న కష్టాల గురించి సీమా సిసోడియా మాట్లాడుతూ, “ఈ రోజు మనీష్ ముఖంలో అచంచలమైన దృఢ నిశ్చయాన్ని చూశానని.. అది అతని మాటలలో స్పష్టంగా కనిపిస్తుంది. అని తెలిపింది.
నేను, నా భర్త, కుటుంబ సభ్యులు ఇంకెన్నాళ్లు ఇలాంటి కుట్రలు ఎదుర్కోవాలో అంటూ వాపోయారు. రాజకీయాలను అందుకే మురికితో పోల్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చదువు కోసం అరవింద్, మనీష్ కన్న కలలను మాత్రం కటకటాల వెనక్కి నెట్టలేరు. కచ్చితంగా పాలిటిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గెలిచి తీరుతుంది. మనీష్ నిన్ను చూసి గర్విస్తున్నా…అంటూ ఆ లేఖలో వివరించారు.
Read Also: Odisha: గూడ్స్ ట్రైన్ కింద తలదాచుకుందామని వెళ్తే.. చక్రాల కిందపడి ఆరుగురు మృతి
మరోవైపు భార్యను కలుసుకునేందుకు మనీష్ సిసోడియాకు కోర్టు షరతులు విధించింది. తీహార్ జైలులో ఉంటున్న సిసోడియా.. ఆయన బెయిల్ దరఖాస్తును కోర్టు పలుమార్లు తోసిపుచ్చింది. అస్వస్ధతతో ఉన్న సీమ సిసోడియాను కలుసుకునేందుకు కొన్ని షరతులతో అంగీకరించింది. పోలీసుల సమక్షంలో ఇంటి వద్ద కానీ, ఆసుపత్రిలో కానీ ఉదయం 10 గంటల నుండి 5 గంటల లోపు ఒకరోజు ఆమెను కలుసుకోవచ్చని తెలిపింది. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో మినహా ఎవరితో మాట్లాడరాదని, మీడియా ముందుకు వెళ్లరాదని, ఫోను, ఇంటర్నెట్ను ఉపయోగించరాదని షరతులు పెట్టింది.
తాజావార్తలు
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్‌కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్‌కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!