TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET-Inservice Teachers-2026) కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పాఠశాల విద్య శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మొత్తం మూడు సెషన్లలో ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.
ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,986 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 22,477 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం మీద 89.96 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు అధికారులు వెల్లడించారు. వివిధ కారణాల వల్ల 2,509 మంది ఉపాధ్యాయులు పరీక్షకు గైర్హాజరయ్యారని విద్యాశాఖ పేర్కొంది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
పరీక్షలు పూర్తి కావడంతో అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 15, 2026న అధికారిక వెబ్సైట్లో ‘ప్రాథమిక కీ’ ని విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ సమాధానాలను ఈ కీ ద్వారా సరిచూసుకోవచ్చు.
ప్రాథమిక కీ పై ఏవైనా అభ్యంతరాలు లేదా ప్రశ్నలపై సందేహాలు ఉంటే, వాటిని నమోదు చేసుకోవడానికి విద్యాశాఖ అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆన్లైన్ విధానంలో తమ అభ్యంతరాలను ఆధారాలతో సహా సమర్పించవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది కీ, అలాగే ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలు, అభ్యంతరాల నమోదు కోసం అధికారిక వెబ్సైట్ https://www.schooledu.telangana.gov.in ను సందర్శించవచ్చు.
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!