Padma Rao Goud: ప్రజల గొంతుకగా నిలిచేందుకు మద్దతు తెలపాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padma Rao Goud: పార్లమెంట్లో ప్రజల గొంతుకగా నిలిచేందుకే తనకు మద్దతు తెలపాలని.. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఇతర నేతలతో కలిసి రాంగోపాల్ పేట్, నల్లగుట్ట, కాచిబౌలి, గైదన్ భాగ్ బస్తీలలో పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు. పద్మారావు నగర్లో పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పద్మారావు గౌడ్ పర్యటనకు ప్రజలు అనూహ్య స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి తమ పర్యటనలకు మంచి స్పందన లభించిందని తెలిపారు. తమ విజయం ఖాయంగా మారిందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు శ్రమించి పోలింగ్ శాతం పెంచుకుంటే తమ ఆధిక్యత పెరుగుతుందని అన్నారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోనుందని అన్నారు. తాము చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందన్నారాయన. కేసీఆర్ నాయకత్వంలోని 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని .. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తుందన్నారు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్.
Also Read
- KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
- Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?
- sonam wangchuk: "మాకు మంత్రి పదవులపై ఆశ లేదు".. విద్యా వ్యవస్థ లోపాలపై సోనామ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు..
- Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!
తాజావార్తలు
-
KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
-
VIJAY : తమిళనాడు సీఎం విజయ్ – భార్య సంగీతను కలిపేందుకు ప్రయత్నాలు
-
Police Complaint Director: వారి వల్లే వరలక్ష్మికి సారీ చెప్పా.. సమస్య సద్దుమణగలేదు!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
100% Ethanol: 100% ఇథనాల్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. E100 ఇంధనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!