Opposition meeting: జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో విపక్ష నేతల రెండో సమావేశం.. స్పష్టం చేసిన కాంగ్రెస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనల మధ్య విపక్షాల రెండో సమావేశం వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశం ఈనెల 17, 18 తేదీల్లో బెంగళూరులో జరగనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జరిగే సన్నాహకానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల సమావేశం రెండోసారి నిర్వహిస్తుంది.
Bandla Ganesh: గురు పూర్ణిమ.. దూరంగా ఉంటా అంటూ బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్
Also Read
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
అంతకుముందు సమావేశానికి సంబంధించి జనతాదళ్ యునైటెడ్ (జెడియు) నేత కేసీ త్యాగి మాట్లాడుతూ.. వచ్చే వారం బెంగళూరులో జరగాల్సిన ప్రతిపక్ష పార్టీల ముఖ్యమైన సమావేశం వాయిదా పడిందని.. వర్షాకాల సమావేశం తర్వాతకు వాయిదా వేసినట్లు చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత.. సమావేశానికి సంబంధించి కొత్త తేదీ నిర్ణయించబడుతుందని తెలిపారు. మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ (RJD) ఎంపీ మనోజ్ ఝా ఈ సమావేశంపై ANIతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల సమావేశం 2 నుంచి 4 రోజులు ఆలస్యం కావచ్చని.. లేదా ముందుగానే నిర్వహించవచ్చు అని తెలిపారు. చాలా మంది నేతలు బిజీగా ఉండటంతో.. ఇంకా తేదీని నిర్ణయించలేదన్నారు. అయితే వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Anushka: నవ్వి నవ్వి ఏడుస్తారు… టిష్యూస్ తెచ్చుకోండి… మాములుగా ఉండదు
బీహార్ శాసనసభ వర్షాకాల సమావేశాలు వచ్చే వారం జూలై 10న నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు జూలై 24 వరకు కొనసాగనున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇద్దరూ అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉంటారు. అందువల్ల సమావేశాన్ని వాయిదా వేయాలని నితీష్ కుమార్ పార్టీ నేతలు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గేను కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గత వారం శనివారం మాట్లాడుతూ.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ప్రారంభమవుతాయని.. ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని చెప్పారు. 23 రోజుల పాటు జరిగే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 23 సభలు జరగనున్నాయని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!