NTV Telugu Site icon

Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Dowleswaram Barrage

Dowleswaram Barrage

Dowleswaram Barrage: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉద్ధృతి బాగా పెరుగుతోంది. గోదావరి వరద ఉద్ధృతితో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ నుంచి 13 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీనితో బ్యారేజీ దిగువన లంక గ్రామాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. లంక గ్రామాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఎగువ ప్రాంతాలతో పాటు, నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి వరద నీటిమట్టం తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. దీనితో బ్యారేజీ వద్ద గోదావరి మరికొంత మేరకు వరద ఉద్ధృతి పెరిగి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: Ambati Rambabu: చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే.. అంబటి ధ్వజం

మరోవైపు, అధికారులను ఎప్పటికప్పుడు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేస్తోంది. సహాయక చర్యల్లో 3 ఎన్‌డీఆర్ఎఫ్, 4 ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఇక అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101 ఉండనున్నాయి. గోదావరి పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.