NTV Telugu Site icon

Gautham Adani: అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం.. మరో 15 రోజులు గడువు కోరిన సెబీ

Adani

Adani

అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్‌ వివాదానికి సంబంధించిన మరో కీలక అప్డేట్ వచ్చింది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ భారత బిలీనియర్ గౌతం అదానీ నేతృత్వంలోని కంపెనీలపై అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. అంతేకాకుండా రాజకీయంగా కూడా సంచలనం సృష్టించాయి.

హిండెన్‌బర్గ్‌ సంస్థ ఆరోపణల నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అదానీ కంపెనీలపై విచారణ చేపట్టింది. ఈ ఏడాది మేలో, ఈ అంశానికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించేందుకు సెబీకి ఆగస్ట్ 14 వరకు దేశ సర్వొన్నత న్యాయస్థానం గడువునిచ్చింది. అయితే ఈరోజు ఉదయం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సెబీ విచారణను పూర్తి చేసేందుకు మరో 15 రోజుల సమయం కావాలని కోరింది.

Also Read: Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపుల క‌ల‌క‌లం.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు..!

ఇప్పటికే దర్యాప్తు చివరి దశకు చేరుకుందని, 24 లావాదేవీల్లో 17 లావాదేవీలపై దర్యాప్తు పూర్తి చేసినట్టు కోర్టుకు తెలియజేసింది. ఇప్పటివరకు సేకరించిన అంశాల ఆధారంగా మధ్యంతర నివేదికను సిద్ధం చేసినట్టు సెబీ వివరించింది. ఆగస్టు 29లోగా విచారణ పూర్తి చేస్తామని గడువు కావాలని అభ్యర్థించింది. ఈలోపు పలు విదేశీ ఏజెన్సీలు, నియంత్రణ సంస్థల నుంచి సమాచారాన్ని కోరామని, అవి అందిన తర్వాత తదుపరి కార్యక్రమాలు పూర్తిచేస్తామని వివరించింది.