Godavari River Tragedy: గోదావరిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు.. ఒక మృతదేహం లభ్యం!
- గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు
- యువకుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
- ఒక మృతదేహం లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని లంక వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన 8 మంది యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము వరకు గజ ఈత గాళ్లు, వలల సాయంతో ఎస్డీఆర్ఎఫ్ అధికారులు గోదావరిని జల్లెడ పట్టారు. ప్రమాదం జరిగిన సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం వడ్డే మహేష్‌గా గుర్తించారు. ఇంకా ఏడుగురి యువకుల ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
శేరిలంకకు చెందిన కొండేపూడి నాగరాజు-చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమజ్యోతి రజస్వల వేడుకకు ఆమె సోదరుడు పోలిశెట్టి అభిషేక్ తన స్నేహితులను పిలిచాడు. అభిషేక్ ఆహ్వానంపై పలు ప్రాంతాలకు చెందిన మిత్రులు, బంధువులు వేడుకకు హాజరయ్యారు. భోజనాలు ఆరగించిన తరువాత సరదాగా గౌతమి గోదావరిలో స్నానం చేసేందుకు 11 మంది వెళ్లారు. ముందుగా ఒక యువకుడు స్నానానికి దిగి.. కాస్త లోపలికి వెళ్ళాడు. అక్కడ లోతుగా ఉండడంతో అతడు మునిగిపోయాడు. అది చూసిన మరో ముగ్గురు అతడిని రక్షించేందుకు గోదావరిలోకి దిగి మునిగిపోయారు. అలా ఒకరి తరువాత ఒకరు గోదావరిలోకి వెళ్లి గల్లంతయ్యారు.
Also Read
Also Read: Mahanadu 2025: నేటి నుంచి టీడీపీ మహానాడు.. ఈరోజటి కార్యక్రమాలు ఇవే!
ప్రమాదాన్ని గ్రహించిన ముగ్గురు యువకులు నదిలోకి దిగకుండా సురక్షితంగా బయటపడ్డారు. యువకులు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన అందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగింది. ప్రమాదం జరిగిన సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతయిన ఎనిమిది మందిలో నలుగురు రెండు కుటుంబాలకు చెందిన సోదరులు. మహేష్, రాజేష్.. క్రాంతి కిరణ్, పాల్ అభిషేక్ సొంత సోదరులు. దీంతో యువకుల కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. కమిని లంక పాయ దగ్గర గోదావరి లోతుగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. యానాం దగ్గర గోదావరి, సముద్రం పోటు కారణంగా నీళ్లు వెనక్కి ఫోర్స్ గా వస్తాయని మత్స్యకారులు అంటున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!