Student Carried Nonveg for Tiffin : ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ పాఠశాలకు నాన్ వెజ్ టిఫిన్ (ఆహారం) తీసుకొచ్చినందుకు ముస్లిం చిన్నారిని పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం వైరల్ గా మారింది. ఈ ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆ పిల్లోడి తల్లికి మధ్య జరిగే సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో బయటకు రావడంతో ఇప్పుడు ఈ కేసులో ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Constable Bribe: రూ. 20 లంచం తీసుకున్న కానిస్టేబుల్.. 34 ఏళ్ల తర్వాత అరెస్టుకు ఆదేశాలు..
ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఈ వివాదం జరిగిన చిన్నారి నర్సరీ తరగతి విద్యార్థి అని, నర్సరీకి చెందిన ఈ చిన్నారి వల్ల ఇతర పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ప్రిన్సిపాల్ చెప్పారు. దేవాలయాలను ధ్వంసం చేసే ఇలాంటి పిల్లలకు చదువు చెప్పకూడదు. ఆహారం కోసం నాన్ వెజ్ తెస్తాం. నేను అందరినీ ముస్లింలుగా మారుస్తానని ఆ చిన్నారి చెప్పినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నాడు. అయితే పాఠశాలలో హిందూ – ముస్లిం సమస్యలపై చర్చ జరుగుతుందని చిన్నారి తల్లి తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పిల్లలను తరగతిలో ఒంటరిగా ఉంచినప్పటికీ ప్రిన్సిపాల్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదని చిన్నారి తల్లి పేర్కొంది. అంతేకాకుండా ఈ కారణంగానే తన కుమారుడిని తరగతిలోని ఇతర పిల్లలు కొట్టారని., ఆ మహిళ తెలిపింది. మీ పిల్లల పేరును స్కూల్ నుంచి తీసేయడానికి మిమ్మల్ని పిలిపించామని ప్రిన్సిపాల్ తనతో చెప్పారని మహిళ తెలిపింది.
AP Wines Shops Close: ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. వైన్ షాపులు బంద్..?
'Islamophobia'
A 7-year-old Muslim child was expelled from Hilton Public School, Amroha, over allegations of bringing non-veg food.
The principal allegedly stated, "We can't educate kids who break our temples, harm Hindus, talk about converting all Hindus, and destroying Ram… pic.twitter.com/WvfY3WiGKl
— Gabbar (@Gabbar0099) September 5, 2024