తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల 72గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ ప్రకటించింది. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో వచ్చే మూడు రోజుల కుండపోత వానలు ఉండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
Also Read : IND vs WI: నేటి నుంచి భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు.. 100లో అయినా పోటీ ఉంటుందా?
రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. జులై 20, 21న అన్ని విద్యా సంస్థలు బంద్ అని స్పష్టం చేశారు.విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సబితా పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థలు ప్రత్యేక తరగతులు తదితర కారణాల పేరుతో కాలేజీలు, బడులను నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ఆమె ట్వీట్ కూడా చేశారు.
Also Read : Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపైనే విపక్షాల ఫోకస్