Viral Video: ఆడపిల్ల కాదు ఆడపులి.. ఆటోను అమాంతం లేపి తల్లిని కాపాడిన బాలిక! వీడియో వైరల్
- ఆటోను అమాంతం లేపిన బాలిక
- ఆటోలో ఇద్దరు వ్యక్తులు ఉండడం గమనార్హం
- తల్లిని కాపాడిన బాలికపై ప్రశంసల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mangaluru Girl Lifts Auto To Rescue Mother: ‘ఆడపిల్ల’ అని తక్కువగా అంచనా వేయకూడదు. ఆపద వస్తే ‘మహంకాళి’గా మారుతుంది. కళ్ల ముందు ఆపద ఉంటే ఎలాంటి సాహసానికైనా వెనగడుగు వేయదు. ఇక కన్న తల్లికి ఏదైనా జరిగితే ఊరుకుంటుందా?.. క్షణం కూడా ఆలోచించదు. తాజాగా ఓ స్కూల్ విద్యార్థిని తన తల్లిని కాపాడేందుకు.. బోల్తాపడిన ఆటోను అమాంతం పైకి లేపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం… మంగళూరులోని కిన్నీగోళి రామనగర్‌లో ఓ మహిళ ఆవలివైపు ఉన్న తన కుమార్తె కోసం రోడ్డు దాటడానికి ప్రయత్నించింది. తన స్కూటీని పార్క్ చేసిన మహిళ వేగంగా నడుస్తూ రోడ్డు దాటుతోంది. ఆ సమయంలో ఓ ఆటో వచ్చి ఆమెను ఢీకొట్టింది. తల్లిపై ఆటో పడటం చూసిన స్కూల్ విద్యార్ధిని మెరుపు వేగంతో పరుగెత్తుకెళ్లింది. తన రెండు చేతులతో ఆటోను అమాంతం లేపి తల్లిని కాపాడుకుంది. ఆ సమయంలో ఆటోలో ఇద్దరు వ్యక్తులు ఉండడం గమనార్హం. తల్లిని కాపాడుకోవాలనే తాపత్రయంలో బాలికకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దేవుడికే తెలియాలి.
Also Read
- Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
- Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
- Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
- IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్‌తో భారత్‌పై బద్దలైన రికార్డులు...
Also Read: Iphone 16 Launch: నేడే ‘ఐఫోన్ 16’ సిరీస్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిసింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు అందులోని ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు రోడ్డు పక్కనే ఉన్న ఓ షాపు సీసీటీవీలో రికార్డయ్యాయి. తల్లిని కాపాడిన బాలికను అందరూ అభినందిస్తున్నారు. గాయపడిన మహిళను రాజరత్నాపూర్‌కు చెందిన చేతన (35)గా పోలీసులు గుర్తించారు. ట్యూషన్‌కు వెళ్లిన తన కూతురిని తీసుకురావడానికి వెళ్లిన చేతన.. ట్యూషన్ సెంటర్ దగ్గర ప్రమాదానికి గురైంది.
ఆ అడపిల్ల ..
కాదు కాదు ఆడపులి కి💥🔥
మనం ఖచ్చితంగా అభినందనలు చెప్పవలసిందే !! pic.twitter.com/weXc1FMSLO— 🐎🔱 సుజత్ 🕉️✝️☪️ (@Kadirodu) September 8, 2024
తాజావార్తలు
-
Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
-
Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ.. పేడ కుప్పలో రూ.10 లక్షల క్యాష్! రంగంలోకి ‘SIT’..
-
Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
-
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!