Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Scene Is Reversed To India Women In Womens T20 World Cup 2024

T20 World Cup 2024: భారత్ సెమీస్‌ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయిందిగా!

Published Date :October 15, 2024 , 7:03 am
By Sampath Kumar
  • ప్రపంచకప్‌లో టీమిండియాకు నిరాశే
  • సెమీస్‌ చేరుతుందనుకుంటే సీన్ రివర్స్
  • కనీస ప్రదర్శన ఇవ్వలేదు
T20 World Cup 2024: భారత్ సెమీస్‌ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయిందిగా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ కథ ముగిసింది. న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ గెలిస్తే.. సెమీస్‌ అవకాశాలు ఉంటాయని ఆశించిన టీమిండియాకు నిరాశే మిగిలింది. గ్రూప్‌-ఏ చివరి లీగ్‌ మ్యాచ్‌లో కివీస్‌ 54 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి నాకౌట్‌ చేరింది. ఆస్ట్రేలియా అప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో.. భారత్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. భారత జట్టు ఫామ్, ప్లేయర్స్‌ను చూస్తే కచ్చితంగా సెమీస్‌ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయింది.

టీ20 ప్రపంచకప్‌ కోసం బయల్దేరే ముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చేసిన వ్యాఖ్యలకు, తుది ఫలితంకు ఏ సంబంధం లేదు. టీ20ల్లో ఇదే భారత అత్యుత్తమ జట్టు అని, 12 మందికి ప్రపంచకప్‌ ఆడిన అనుభవం ఉందని, వారి సత్తాపై నాకు బాగా నమ్మకముందన్న హర్మన్‌ప్రీత్‌ వ్యాఖ్యలు అందరిలో టైటిల్ ఆశలు రేపినా.. చివరకు నిరాశ పడక తప్పలేదు. గత మూడు ప్రపంచకప్‌లలో సెమీస్, ఫైనల్, సెమీస్‌ రికార్డు.. యూఏఈలో వాతావరణం, పిచ్‌లు భారత్‌కు అనుకూలం అంటూ జరిగిన ప్రచారం.. డబ్ల్యూపీఎల్‌లో మన ప్లేయర్స్ రాణించడం లాంటివి ఏమీ కలిసిరాలేదు.

Also Read: Monkey Viral Video: ‘మామ ఏక్ పెగ్ లా’ అంటూ.. బీరేసిన కోతి!

టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఒక్కతే రెండు అర్ధ సెంచరీలతో రాణించింది. టాప్‌-5లో మిగతా నలుగురు పూర్తిగా విఫలమయ్యారు. స్మృతి మంధాన మూడు కీలక మ్యాచ్‌లలో తేలిపోయింది. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ కనీస ప్రదర్శన ఇవ్వలేదు. బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌ పర్వాలేదనిపించింది. అరుంధతి రెడ్డి, రేణుక సింగ్‌ చెరో 7 వికెట్స్ తీశారు. ఆశా శోభన కూడా రాణించింది. సమష్టి వైఫల్యమే భారత్ కొంపముంచింది. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో భారత్ రెండు గెలిచి, రెండింటిలో ఓడింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Harmanpreet Kaur
  • India women
  • India Women Out
  • Team India
  • Women's T20 World Cup 2024

తాజావార్తలు

  • Holidays: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 9, 23, 29న సెలవు ప్రకటన..

  • Khanapur : ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా

  • Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..

  • Dacoit Trailer : అందరూ మహేష్ బాబులు అయిపోదామనే?

  • CM Chandrababu: అమరావతి రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష.. సీఎం తీవ్ర అసంతృప్తి..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions