Bilkis Bano Plea: బిల్కిస్ బానో అభ్యర్థన.. ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీం అంగీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bilkis Bano Plea: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల శిక్షను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ఆమె పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు బుధవారం అంగీకరించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ మేరకు స్వయంగా బాధితురాలి తరపు న్యాయవాదికి ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని ఆమె న్యాయవాది శోభా గుప్తా ద్వారా వాదించిన బానోకు హామీ ఇచ్చింది. బానో తరపున లాయర్ శోభా గుప్తా విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం ఇందుకు అంగీకరించింది. “నేను బెంచ్‌ను ఏర్పాటు చేస్తాను. ఈ సాయంత్రం దానిని పరిశీలిస్తాను” అని సీజేఐ స్వయంగా శోభాగుప్తాకు చెప్పారు.
Read Also: ISRO Chief: చంద్రయాన్-3 క్రాఫ్ట్ సిద్ధం.. ఈ ఏడాది మధ్యలో ప్రయోగం!
Also Read
- Rajat Patidar: ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
2002 గుజరాత్ అలర్ల సమయంలో.. బిల్కిస్ బానో దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. అదే అల్లర్లలో బిల్కిస్ బానో కుటుంబంలోని ఏడుగురు కూడా మరణించారు. ఇక ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న పదకొండు మందిని.. గుజరాత్ ప్రభుత్వం కిందటి ఏడాది ఆగష్టు 15వ తేదీన రెమిషన్ కింద విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ గత డిసెంబర్‌లో బిల్కిస్ బానో సుప్రీంను ఆశ్రయించగా.. ఆ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇక.. ఈ ఏడాది జనవరి 24వ తేదీన సైతం ఆమె మరో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ సమయానికి ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మరో పిటిషన్‌తో బిజీగా ఉండడం వల్ల ముందుకు కదల్లేదు.
తాజావార్తలు
-
US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్‌గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!