SBI Cards: ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగిపోయింది. బ్యాంకులు కూడా ప్రతి ఒక్కరికి ఒకటికి మించి క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డుల జారీలో దేశంలోని అతి పెద్ద బ్యాంకు కూడా ఒకటి. ఇది క్రెడిట్ కార్డుల ప్రపంచంలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఎస్బీఐ కార్డు భారతదేశం అతిపెద్ద ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ జారీదారు. ఇది ఇటీవల తన కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా అనేక ఆఫర్లను అందించింది. వీటిని పండుగ సీజన్ 2023 కోసం తీసుకువచ్చారు. ఎస్పీఐ కార్డ్ కస్టమర్‌లు సుమారు 2200 మంది వ్యాపారుల ద్వారా మంచి ఆఫర్‌లను పొందవచ్చు. ఇవి కాకుండా, వారు ప్రధాన నగరాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. విశేషమేమిటంటే వీటిలో టైర్ 2, టైర్ 3 నగరాల పేర్లు కూడా ఉన్నాయి.
Read Also:India TV-CNX Opinion Poll: రాజస్థాన్‌లో వికసించేది కమలమే.. గెలుపు అవకాశాలు బీజేపీకే ఎక్కువ..
డ్యూరబుల్స్, మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్, ఫర్నిచర్, ఆభరణాలు, కిరాణా వస్తువులపై క్యాష్‌బ్యాక్, ఇతర ఆఫర్‌లను పొందవచ్చు. అంతే కాకుండా అనేక EMI ఫోకస్డ్ ఆఫర్‌లను ప్రారంభించింది. దీని ద్వారా కార్డ్ హోల్డర్లు సులభంగా కొనుగోళ్లు చేయగలుగుతారు. ఫెస్టివ్ ఆఫర్ 2023 కింద, SBI కార్డ్ కస్టమర్‌లకు దాదాపు 600 జాతీయ స్థాయి ఆఫర్‌లు అందించబడుతున్నాయి. ఇది కాకుండా, 15 నవంబర్ 2023 వరకు చెల్లుబాటు అయ్యే 1500 ప్రాంతీయ, హైపర్‌లోకల్ ఆఫర్‌లు ఉంటాయి. ఈ పండుగ ఆఫర్ కింద SBI కార్డ్ కస్టమర్‌లు 2700 నగరాల్లో 27.5శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు. Flipkart, Amazon, Myntra, Reliance Retail Group, Westside, Pantaloon, Max, Tanishq, TBZ వంటి వివిధ బ్రాండ్‌లపై డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. Samsung, LG, Sony, Oppo, Vivo, Panasonic, Whirlpool, Bosch, IFB, HP, Dell, అనేక బ్రాండ్‌లకు చెందిన డ్యూరబుల్స్, మొబైల్,ల్యాప్‌టాప్లను కొనుగోలు చేస్తే SBI కార్డ్‌లో EMI ఫోకస్డ్ ఆఫర్ లభిస్తుంది. SBI కార్డ్ MD, CEO అయిన అభిజీత్ చక్రవర్తి మాట్లాడుతూ.. కస్టమర్‌ల అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామన్నారు.
Read Also:Irfan Pathan: షాహీన్ అఫ్రిదిపై టీమిండియా మాజీ క్రికెటర్ ప్రశంసలు