Satyavathi Rathod : ఇన్ని రోజులు మీరు చెప్పింది అబద్దం అని క్షమాపణ చెప్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే.. సుప్రీంలో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందిందనీ.. తెలంగాణ బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు 2017లో హోంశాఖకు చేరిందన్నారు. ప్రస్తుతం ఈ రిజర్వేషన్ల కేసు సుప్రీంలో పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. సుప్రీం కోర్టులో కేసుల పరిష్కారం తర్వాతే రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని లేఖలో వివరించింది కేంద్రం. అయితే.. దీనిపై తాజాగా తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ గిరిజనులకు అన్యాయం చేసిందన్నారు.
Also Read : Damodar Raja Narasimha : కాంగ్రెస్కు కోవర్ట్ రోగం పట్టింది
గిరిజన రిజర్వేషన్లు 10 శాతం పెంచాలని కేసిఆర్ ఆలోచన చేశారని, సెప్టెంబర్ 17న గిరిజన బంజారా భవన్లు ప్రారంభించి 10 శాతం పెంచుతామని సీఎం కేసిఆర్ సభలో ప్రకటన చేశారన్నారు. సుప్రీం కోర్టులో కేసు ఉందని, కేంద్ర మంత్రి అర్జున్ ముండా పార్లమెంట్ లో ప్రకటన చేశారని, 9వ షెడ్యూల్ లో పెట్టి రాష్ట్రపతి చేత ఆమోదం తెలపాలని చెప్పినా కేంద్రము నుంచి స్పందన లేదని ఆమె మండిపడ్డారు. ఇన్ని రోజులు మీరు చెప్పింది అబద్దం అని క్షమాపణ చెప్తారా? అని ఆమె ప్రశ్నించారు. కేంద్రం గిరిజన రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకపోతేత బీజేపీ నేతలను తెలంగాణలో తిరగనివ్వరని ఆమె ధ్వజమెత్తారు. కచ్చితంగా అడ్డుకుంటామని, గిరిజన రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీయం బాపు రావు వైఖరీ ఏంటో చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఓట్లు వేయించుకోవడానికి గిరిజనులను చూస్తున్నారు తప్ప పట్టించు కోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Story Board: దేశ రాజకీయం యువత చుట్టూ తిరగబోతోందా? అందుకే పార్టీలన్నీ Gen-Z జపం చేస్తున్నాయా?
- BE ALERT: గుండు గీకిన బంటు..తమిళనాడులో విక్రమార్కుడు సీన్..
- Humanoid Robot: రూ.3,000 ఇస్తే చాలు... మీ ఇంట్లోని చెత్తంతా ఎత్తి పడేస్తుంది..
- Love Fail: లవర్ హ్యాండ్ ఇచ్చాడని మనస్తాపం... సీపీఆర్ చేసినా దక్కని యువతి ప్రాణాలు..
- Tags
- bjp
- breaking news
- BRS
- cm kcr
- latest news
తాజావార్తలు
-
Story Board: దేశ రాజకీయం యువత చుట్టూ తిరగబోతోందా? అందుకే పార్టీలన్నీ Gen-Z జపం చేస్తున్నాయా?
-
Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!
-
Student Suicides: మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపం.. రెండు కుటుంబాల్లో కన్నీటి విషాదం
-
BE ALERT: గుండు గీకిన బంటు..తమిళనాడులో విక్రమార్కుడు సీన్..
-
Humanoid Robot: రూ.3,000 ఇస్తే చాలు… మీ ఇంట్లోని చెత్తంతా ఎత్తి పడేస్తుంది..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!