సత్యం రాజేష్ ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఇప్పుడు హీరోగా అలరిస్తున్నాడు.. గతంలో పొలిమేర 2 సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్నాడు.. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘టెనెంట్’.. ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. బలగం హీరో ప్రియదర్శి ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రేమకథ, పెళ్లి సన్నివేశాలతో ఫీల్ గుడ్ గా మొదలైన ట్రైలర్ తర్వాత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో చూపించిన కంటెంట్ చాలా ఆసక్తిగా వుంది. ఈ ట్రైలర్ లో పోలీస్ ఆఫీసర్ గా ఎస్తర్ కనిపిస్తుంది.. నమ్మి వచ్చిన అమ్మాయిని నువ్వే చంపేయడం ఏమిటి? అని ప్రశించగా.. ‘రావణాసురుడు సీతని చెరబడితే శిక్ష సీతకెందుపడింది?’ అని సత్యం రాజేష్ అంటారు.. దాంతో ట్రైలర్ ముగుస్తుంది..
పొలిమేర లో లాగే ఈ సినిమాలో కూడా సత్యం రాజేష్ అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో కనబరిచాడు.. ఇక ట్రైలర్ లో కనిపించిన మిగతా నటులు కూడా తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఈ సినిమా కోసం తీసుకున్న పాయిటింగ్ చాలా ఎమోషనల్, థ్రిల్లింగ్ గా వుంది. బ్యాగ్రౌండ్ థ్రిల్ మని మరింత ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది..