NTV Telugu Site icon

Zebra Satyadev First Look : జీబ్రా నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ రిలీజ్..

Zebra

Zebra

Zebra Satyadev First Look : ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ చిత్రం ‘జీబ్రా’ లో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలి ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించారు. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్. ఎన్. రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. ఈ పోస్టర్ లో సత్యదేవ్ సూట్ లో స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్నాడు. కానీ, ఆయన ముఖం సీరియస్ లొక్స్ తో చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు. అతను భుజం మీద సంచి పట్టుకుని కాస్త కోపంగా నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే మరొక చేతిలో పెన్ను ఉంది. బ్యాక్గ్రౌండ్ పోస్టర్లో కరెన్సీ నోట్లతో సత్యదేవ్ కనిపించారు. ఈ చిత్రంలో సత్యదేవ్ పాత్ర ఎంత తీవ్రంగా ఉండబోతోందో ఫస్ట్ లుక్ సూచిస్తుంది.

Gold Price Today: భారీ షాక్.. తులం బంగారంపై రూ.710 పెరిగింది!

” లక్ ఫేవర్స్ ది బ్రేవ్ ” అనేది ఈ చిత్రానికి ట్యాగ్లైన్. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దాంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిక్నాటో కథానాయికలుగా నటిస్తున్నారు. సత్య అకాల, సునీల్ ఇతర ప్రముఖ తారాగణం సినిమాలో నటిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సత్య పొన్మార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాత. ఎడిటింగ్ బాధ్యతలను అనిల్ క్రిష్ చూసుకోగా, సంభాషణలు మీరాఖ్ రాశారు. ఈ సినిమాలో సత్యదేవ్, డాలి ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిచ్చినాటో, సత్య అకాల, సునీల్ లు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Gold Price Today: భారీ షాక్.. తులం బంగారంపై రూ.710 పెరిగింది!

Show comments