Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయసాయిరెడ్డి కొత్తగా పార్టీ పెట్టుకోవడానికి ఆయనకు స్వేచ్ఛ, హక్కు ఉన్నాయని ఏపీ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి లూటీ చేసిన ప్రజాధనం ఎక్కడ దాచారో ముందుగా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పై ఉన్న అవినీతి కేసుల్లో ఆయన ఏ2గా ఉన్నారనే విషయాన్ని గుర్తుచేస్తూ, ఆయనకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేయడం హాస్యాస్పదమని కొట్టిపారేశారు. విజయసాయిరెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్ అవినీతికి సంబంధించిన పూర్తి లెక్కలను బహిర్గతం చేయాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే కొత్త పార్టీ పెట్టుకోవాలని హితవు పలికారు.
మరొకవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీరును సైతం ఆయన తీవ్రంగా నిరసించారు. గతంలో కేతిరెడ్డికి ఉన్న డబ్బులు, పేకాట క్లబ్బులు, ఫారిన్ ట్రిప్పులు ముగిసిపోవడంతో, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ ‘గుడ్ మార్నింగ్’ కార్యక్రమం పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. కామెడీ షో మాదిరిగా ముందస్తుగా సిద్ధం చేసిన నటులతో వచ్చి డ్రామాలు ఆడుతున్నారని, ఆయన చేసే షోల ముందు జబర్దస్త్ నటులు కూడా పనికిరారని విమర్శించారు. గత 20 ఏళ్లుగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలకు తనను బాధ్యుడిని చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ గత 10 ఏళ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరున్నారో కేతిరెడ్డి ముందుగా సమాధానం చెప్పాలని నిలదీశారు. స్థానిక ఎన్నికలు ముగియగానే కేతిరెడ్డి మళ్లీ తన పాత పేకాట క్లబ్బులకే పరిమితమవుతారని వ్యాఖ్యానించారు.
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
చివరగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూటమిలోని మూడు పార్టీలు (టీడీపీ, జనసేన, బీజేపీ) కలిసి నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. దీనికోసం ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!