ఆధునిక సాంకేతిక యుగంలో మనుషుల మనుగడ కృత్రిమ ఉపగ్రహాలపై ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు.. అన్ని రంగాల్లోనూ వీటి వాడకం పెరిగిపోయింది. అయితే ఈ ఉపగ్రహాల కాంతి, విద్యుత్, బల్బుల వెలుగుతో భూమికి పెద్ద ముప్పు వాటిల్లుతున్నట్లు ఇటలీ, చిలీ, గేలిసియా శాస్త్రవేత్తలు తాజా అధ్యయంలో తేలింది. ఈ వివరాలను నేచర్ అస్ట్రానమీ అనే పత్రికలో ప్రచురించారు. భూగోళం చుట్టూ 8 వేలకు పైగా శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి భూవిపై ప్రతి అంగుళాన్ని కవర్ చేస్తున్నాయి. స్పేక్ ఎక్స్ సంస్థ 3,000కు పైగా చిన్నపాటి ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రయోగించింది. వన్ వెబ్ కూడా వందలాది కృత్రిమ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది.
Also Read : Manish Tewari : రాహుల్ పై అనర్హత వేటు.. లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా నోటీసు
దేశాల మధ్య పోటీ నేపథ్యంలో భవిష్యత్ లోనూ వీటి సంఖ్య మరింత పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు కనిపిచండం లేదు.. మరోవైపు విద్యుత్ లైట్ల అవసరం పెరుగుతునే ఉంది. శాటిలైట్ల నుంచి వచ్చే కాంతి.. కరెంట్ దీపాల నుంచి కాంతి వల్ల భూమిపై ప్రకృతికి విఘాతం వాటిల్లుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. వీటివల్ల రాత్రిపూట ఆకాశం స్పష్టంగా కనిపించడం లేదని తేల్చారు. అంతేగాక ఖగోళ శాస్త్రవేత్తల విధులకూ ఆటంకం కలుగుతోంది. అస్ట్రానమికల్ అబ్జర్వేటరు మందగిస్టున్నట్లు తేలింది. ఈ కాంతి కాలుష్యం కారణంగా రాత్రివేళలో అనంతమైన విశ్వాన్ని కళ్లతో, పరికరాలతో స్పష్టంగా చూడగలిగే అవకాశం తగ్గుతుంది.
Also Read : Cheating: ఆమె టీచర్.. సినిమాలో స్టైల్‌లో చీటింగ్..
అంతేకాడు భూమిపై జీవుల అలవాట్లోతో, ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయని ఈ సైంటిస్టులు వెల్లడించారు. దీనికి అడ్డుకట్ట వేసి సహజ ప్రకృతిని పరిరక్షించుకొనే దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. కాంతి కాలుష్యానికి ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి పరిష్కార మార్గం లేదని నిపుణులు అంటున్నారు. దాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టడం మేలు.. శాటిలైట్లలో బ్రైట్ నెస్ తగ్గించాలి.. టెలిస్కోప్ పరికారల్లోని షట్టర్లను కాసేపు మూసేయడం ద్వారా కాంతి తీవ్రతను తగ్గించవచ్చు అని సూచిస్తున్నాయి. కృత్రిమ ఉపగ్రహాలతో కాంతి కాలుష్యమే గాక మరెన్నో సమస్యలున్నాయి. కాలం తీరిన శాటిలైట్లు అంతరిక్షంలోనే వ్యర్థాలుగా పోగుపడుతున్నాయి. అంతరిక్ష కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. పైగా వీటి నుంచి ప్రమాదకర విష వాయువులు వెలువడుతుంటాయి. ఆర్బిటాల్ ట్రాఫిక్ మరొ పెను సమస్యగా మారింది.