Cheating: టీచర్‌అంటే సామాజంలో ఎంతో గౌరవం ఉంటుంది.. ఓ విద్యార్థిని తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకం.. అయితే, టీచర్‌గా పనిచేస్తోన్న ఓ యువతి.. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కింది.. సోషల్ మీడియా ద్వారా బడాబాబులకు వల వేసి అందనికాడికి లాగడమే పనిగా పెట్టుకుంది.. సినిమా స్టైల్‌లో మోసాలకు పాల్పడింది.. టీచింగ్ సంగతి ఏమో కానీ.. చీటింగ్ మాత్రం ఓ రేంజ్‌లో చేసింది.. తప్పు ఏదైనా ఎక్కువ కాలం దాగదు అన్నట్టుగా.. ఓ బాధితుడి ఫిర్యాదుతో ఆమె వ్యవహారం మొత్తం బయటపడింది.. ప్రస్తుతం కటకటాల్లో ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది..
Read Also: Khalistani Amritpal: యూపీలో హై అలర్ట్.. అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా పోస్టర్లు
చెన్నైలో బయటపడిన సినిమా స్టైల్‌లో జరుగుతోన్న చీటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వ్యాపారులను టార్గెట్ చేసింది హెసల్ అనే స్కూల్ టీచర్.. సోషల్ మీడియాలో ఖాతాను ఓపెన్ చేసిన ఆమె.. బడా వ్యాపారులను టార్గెట్ చేస్తూ.. చాటింగ్ చేస్తుంది.. పెళ్లి జరిగి కొద్ది రోజులకే భర్త చనిపోయాడని తనకు ఇప్పుడు ఎవరు లేరని నమ్మబలికేది.. బడా వ్యాపారులతో సన్నిహితంగా ఉంటూ.. వారి వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేసింది.. వ్యాపారుల నుంచి తన బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేయించుకన్న తర్వాత.. హెసల్ వారిని కట్ చేస్తూ వెళ్లింది.. అయితే, ముంబైకి చెందిన వ్యాపారి రాజేష్ ఇచ్చిన ఫిర్యాదుతో అప్రమత్తమైన కోయంబత్తూర్ పోలీసులు.. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. తీగ లాగితే డొంక కదులుతున్నట్టు.. పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగు చూశాయి.. హెసల్ డబ్బు కోసం చాలా మందిని మోసం చేసినట్టు విచారణలో తేల్చారు పోలీసులు.. చివరకు హెసల్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు.
Read Also: Game Changer: మహేశ్ వల్ల 2024 సంక్రాంతి నుంచి చరణ్ సినిమా తప్పుకుందా?
మొత్తంగా.. ముంబైకి చెందిన వ్యాపారిని రూ.20 లక్షలు మోసం చేసింది కోయంబత్తూరుకు చెందిన టీచర్.. ముంబైలోని చెంబూరు సెల్ కాలనీకి చెందిన ఆర్ రాజేష్ (44) పోదనూరు పోలీస్ స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్ మణికి ఫిర్యాదు చేశారు. ముంబైలోని చెంబూర్ రైల్వే స్టేషన్‌లో తాను ట్రావెల్స్ ఏజెన్సీని నడుపుతున్నట్లు రాజేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతను తన బంధువు ద్వారా 2020లో లోరెన్ అనే మహిళతో స్నేహం చేశాడు. తరువాత, లోరెన్ తన చెల్లెలు హెసల్ జేమ్స్‌ను పరిచయం చేసింది. ఆమె నాకు అవివాహిత అని మొదట్లో చెప్పింది. తరువాత, ఆమె వితంతువు అని చెప్పింది. కొన్ని నెలల తర్వాత, తాను తన భర్త నుండి విడిపోయానని, కోయంబత్తూరులోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు పెండింగ్‌లో ఉందని చెప్పింది. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి పోదనూరులోని సత్యసాయి నగర్‌లో నివాసం ఉంటున్నట్లు చెప్పింది. ఆమె రూ.90,000 అప్పుగా అగిగితే నేను ఆమెకు అందించాను. ఆమె నా నుండి కారు, మొబైల్ ఫోన్లు, దుస్తులు, పాదరక్షలు మరియు ఇతర బహుమతులతో సహా రూ. 20 లక్షల విలువైన వస్తువులను పొందింది అని ఫిర్యాదులో పేర్కొన్నాడు రాజేష్. అయితే, ఆమెకు చాలా మందితో పరిచయం ఉన్న విషయం తెలుసుకున్న బాధితుడు.. తాను ఇచ్చిన బహుమతులు, కారును తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే, ఆమె వాటిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది.. అంతేకాదు.. అవసరం అయితే నిన్ను లేపేస్తానని బెదిరించింది.. రూ. 2 లక్షలు ఇస్తే నిన్ను చంపేసే ముఠా నా దగ్గర ఉందని వార్నింగ్ ఇచ్చింది.. దీంతో నేను మోసపోయానని గుర్తించిన రాజేష్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం వెలుగు చూసింది.