TG News: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి.. మంత్రులు విజ్ఞప్తి
- సమగ్ర శిక్ష ఉద్యోగులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క చర్చలు
- గత కొన్ని రోజులుగా తన సమస్యలు పరిష్కరించాలని సమ్మె
- విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమించాలని కోరిన మంత్రులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత 25 రోజులుగా సర్వ శిక్షా ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెకు దిగారు. ఈ క్రమంలో.. ఉద్యోగుల ప్రతినిధులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్సీ కోదండరాం, విద్యాశాఖ అధికారులు చర్చలు నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్ శ్రేయస్సు దృష్ట్యా తక్షణమే సమ్మె విరమించాలని మంత్రులు కోరారు. సమ్మె చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని, కేజీబీవీ పాఠశాలల్లో బడగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నారని, విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని సర్వ శిక్షా ఉద్యోగులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క విజ్ఞప్తి చేశారు.
Read Also: Manish Sisodia: ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఆర్థిక సాయం చేయండి.. ప్రజలకు సిసోడియా విజ్ఞప్తి
Also Read
ఈ క్రమంలో సర్వ శిక్షా ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకున్నారు. తాము సుదీర్ఘ కాలంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేస్తున్నామని.. తమని రెగ్యులరైజ్ చేయడం లేదా ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కూల్ అమలు చేయాలని తెలిపారు. అయితే.. సర్వ శిక్షా కస్తూర్బా గాంధీ పాఠశాలు కేంద్రం పరిధిలో 60 శాతం, రాష్ట్రం పరిధిలో 40 శాతం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. సర్వ శిక్షా ఉద్యోగుల సమస్య తెలంగాణలోనే లేదని.. దేశ వ్యాప్తంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కోరితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి కేంద్రానికి ప్రతిపాదనలు పెడతామని మంత్రి పొన్నం వెల్లడించారు.
Read Also: Tummala Nageswara Rao: రేవంత్ ప్రభుత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నాం..
25 రోజులుగా కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె చేయడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని.. తక్షణమే సమ్మె విరమించి ఉద్యోగులు విధుల్లో చేరాలని మంత్రులు కోరారు. సమ్మె విరమిస్తే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీతో సమావేశానికి పిలుస్తామని మంత్రి సీతక్క తెలిపారు. నాన్ ఫైనాన్సియల్ డిమాండ్స్‌లో మహిళా ఉద్యోగులకు మెటర్నరి లీవ్స్, సీఎల్‌లు తదితర వాటిపై సాధ్యమైనంత వరకు ప్రభుత్వం పరిష్కరమయ్యేలా ప్రభుత్వం చూస్తుందని.. ఆర్థికపరమైన డిమాండ్స్ పై సబ్ కమిటీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని మంత్రులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!